Weather Update : ఏపీ, తెలంగాణకు భారీ వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. ఏ క్షణమైన వర్షం పడొచ్చు..!
Weather Update : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.
Weather Update
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
- పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం
- జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచనలు
Weather Update : బాబోయ్.. వర్షాలు దంచికొడుతున్నాయి.. తెలుగురాష్టాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణలో మరోసారి వర్ష మేఘాలు కమ్ముకున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో హెచ్చరి జారీ చేసింది. వర్షాల సమయంలో రెండు రాష్ట్రాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అందులోనూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also : LPG e-KYC Alert : LPG గ్యాస్ కస్టమర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆగస్ట్ 16లోపు ఇలా చేయండి.. లేదంటే భారీ నష్టం..!
తెలంగాణ విషయానికి వస్తే..
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్, ఖమ్మం ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అలాగే, సంగారెడ్డి జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడనుంది.
ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మెదక్, వికారాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇప్పటికే ఉంది. గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఏపీలో పిడుగులతో వర్షాలు :
మరోవైపు.. ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగా విజయనగరం, భీమునిపట్నం, ఎస్.కోట, భోగాపురం, కొత్తవలస, ఆనందపురం, సబ్బవరం ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాల సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
