Samsung Galaxy S25 FE : సూపర్ డిస్కౌంట్ మావా.. ఈ శాంసంగ్ ఫోన్ మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!
Samsung Galaxy S25 FE : శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S25 FE భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy S25 FE : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 FE లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ రూ. 52,250 లోపు ధరకే లభిస్తోంది.

భారత మార్కెట్లో రూ. 59,999 ధరకు లాంచ్ కాగా, ఎక్సినోస్ చిప్, ట్రిపుల్ కెమెరా, అమోల్డ్ ప్యానెల్, ప్రీమియం డిజైన్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రూ. 50వేల లోపు ధరలో మంచి ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు.

ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ అసలు ధర రూ. రూ. 59,999 నుంచి రూ. 4వేలు తగ్గింపుతో ప్రస్తుతం రూ. 54,999కే అందుబాటులో ఉంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో రూ. 2,750 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర సుమారు రూ. 52,250కి తగ్గుతుంది.

ఇంకా తగ్గింపు ధరకు కావాలంటే మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇన్వాయిస్ ధరపై రూ. 39,950 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే, రూ. 1,000 విలువైన కూపన్‌ను కూడా పొందవచ్చు. ఈ కూపర్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ కూడా సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ. 9,167 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్టెండెడ్ వారంటీ, యాడ్-ఆన్ కూడా పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 FE స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ డిస్ప్లే ఉంది. 7.4mm మందంతో 190 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ కూడా అందిస్తుంది.

8GB ర్యామ్, ఎక్సినోస్ 2400 చిప్సెట్ ఉంది. స్టోరేజ్ ఆప్షన్లలో 128GB, 256GB, 512GB ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ వన్ యూఐ 8తో ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. సర్కిల్ టు సెర్చ్‌తో సహా శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 8MP టెలిఫోటో లెన్స్, 123-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ 4,900mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. 15W వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
