Road Accident : కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులోని ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు..
Road Accident : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దొరకుంట శివారులో ఆగిఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది.
Travels bus Road accident in Hyderabad-Vijayawada National Highway Suryapet district
Road Accident : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దొరకుంట శివారులో ఆగిఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనలో ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Also Read : GO 77: సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ.. జీవో 77 రద్దు చేయాలని డిమాండ్.. ఏకపక్ష నిర్ణయాలపై నిరసన
ప్రమాదం సమయంలో ట్రావెల్స్ బస్సులో 42మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు తెలిసింది. అయితే, చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సులో సీట్ల మధ్య కొందరు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే, ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా..? అతివేగం కారణమా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు వేగంగా వచ్చి కంటైనర్ ను బలంగా ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
