Bigg Boss 10 Krishnudu Elimination : కృష్ణుడు ఎలిమినేట్.. డ్యాన్సులతో రెచ్చిపోయిన జంటలు.. బిగ్ బాస్ 10 ‘డే 14’ వీకెండ్ ఎపిసోడ్..
నిన్నటి మ్యానిప్యులేటర్- పప్పెట్ అనే గేమ్ కొనసాగించారు. (Bigg Boss 10 Krishnudu Elimination)
Bigg Boss 10 Krishnudu Elimination
Bigg Boss 10 Krishnudu Elimination : నాగార్జున ఎంట్రీ ఇచ్చి నేడు అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం కావడంతో ఆయన్ని తలుచుకుంటూ మాట్లాడారు. అనంతరం కాసేపు ఆడియన్స్ తో మాట్లాడారు. అనంతరం నిన్నటి మ్యానిప్యులేటర్- పప్పెట్ అనే గేమ్ కొనసాగించారు.
నరేష్.. త్రిగున్ మ్యానిప్యులేటర్, వంశీ పప్పెట్ అని చెప్పారు. షాలిని ప్రతిసారి లేట్ అయితున్నందుకు మరోసారి తిట్టాడు నాగ్. షాలిని ఇంకోసారి లేట్ అయితే మేకప్ వల్లే లేట్ అవుతుంది కాబట్టి వారం రోజుల పాటు మేకప్ ఉండదు అని పనిష్మెంట్ ఇచ్చారు నాగార్జున. వంశీ.. మ్యానిప్యులేటర్ వర్షిణి – సుధీర్ పప్పెట్ అని చెప్పాడు. కెప్టెన్సీ టాస్క్ లో రోహిత్ – వంశీతో గొడవ పెట్టుకున్నది చెప్పి రోహిత్ దే తప్పు అని చెప్పాడు నాగార్జున.
వర్షిణి, సుధీర్, సృష్టి, త్రిగున్, కృష్ణుడు, రోహిత్ నామినేషన్స్ లో మిగలగా అందర్నీ పిలిచారు. ఇందులో రోహిత్ సేవ్ అయ్యాడు అని చెప్పారు నాగ్. అమన్.. మ్యానిప్యులేటర్ వర్షిణి, సుధీర్ పప్పెట్ అని చెప్పాడు. ముకేశ్.. మ్యానిప్యులేటర్ త్రిగున్, వంశీ పప్పెట్ అని చెప్పారు. నెక్స్ట్ నామినేషన్స్ లో వర్షిణి, సుధీర్, సృష్టి , త్రిగున్ , కృష్ణుడు మిగలగా వర్షిణి సేవ్ అయింది.
Also See : Rashmika Mandanna : ‘మైసా’ టీజర్ లాంచ్ ఈవెంట్.. చీరలో సందడి చేసిన రష్మిక మందన్న..
ఇక సుధీర్.. త్రిగున్ మ్యానిప్యులేటర్ – వంశీ పప్పెట్ అని చెప్పాడు. త్రిగున్.. ముకేశ్ మ్యానిప్యులేటర్ – వర్షిణి పప్పెట్ అని చెప్పాడు. కెప్టెన్సీ టాస్క్ లో త్రిగున్ సింహం, నక్కలు సాంగ్ పడిన సంగతి తెలిసిందే. దాని గురించి అడిగారు నాగ్. నరేష్ ని త్రిగున్ గురించి రివ్యూ చెప్పమన్నాడు నాగ్. నరేష్ సరదాగా చెప్పాడు. ఆ తర్వాత నాగ్ కొంచెం గ్యాప్ ఇవ్వడంతో ముకేశ్, రోహిత్ .. త్రిగున్ శకుని అని అందరికి చెప్పడం మొదలు పెట్టారు. కృష్ణుడు వచ్చి గేమ్ ఆడతారు అని చెప్పారు. అయితే దీనికి కౌంటర్ గా నాగార్జున.. రోహిత్ కి కృష్ణుడికి ఇష్టమైనవాళ్ళు శకుని అని చెప్పాడు.
అనంతరం సృష్టి, కృష్ణుడు, సుధీర్, త్రిగున్ నామినేషన్స్ లో మిగలగా త్రిగున్ సేవ్ అయ్యాడు అని చెప్పారు. సండే ఫన్ డే కార్యక్రమంలో హౌస్ లో ఉన్నవాళ్లను రెండు టీమ్స్ గా డివైడ్ చేసాడు నాగార్జున. ఆయన చెప్పింది చేసి ఎంటర్టైన్ చేయాలి. ఝాన్సీ పాట పాడింది. త్రిగున్ – అమన్ బిగ్ బాస్ పై పాట పాడారు. ముకేశ్ – దేబ్జానీ కలిసి ఓ రొమాంటిక్ డ్యాన్స్ తో రెచ్చిపోయారు. వేళ్ళ రొమాన్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. చరణ్ – వర్షిణి ఒక మాస్ సాంగ్ కి డ్యాన్స్ వేశారు.
నెక్స్ట్ నామినేషన్స్ లో సుధీర్ సేవ్ అని చెప్పి కృష్ణుడుని ఎలిమినేట్ చేసారు. దీంతో ఈ వారం కృష్ణుడు హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. కృష్ణుడుకి అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చారు. కృష్ణుడు నేను ముందే చెప్పాను నేనే వెళ్ళిపోతాను అని. నేను సరిగ్గా ఆడలేకపోతున్నాను. హెల్త్ సమస్యలు కూడా ఉన్నాయి అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. స్టేజిపైకి వచ్చాక నాగార్జున కృష్ణుడుని నలుగురు నెగిటివ్ పీపుల్, నలుగురు పాజిటివ్ పీపుల్ చెప్పమన్నాడు. కృష్ణుడు.. దేబ్జానీ, సృష్టి, అమన్, ఝాన్సీ పాజిటివ్ పీపుల్ అని, సుధీర్, ముకేశ్, చరణ్, వర్షిణి నెగిటివ్ పీపుల్ అని చెప్పారు.
Also Read : Mysaa Teaser : ‘మైసా’ టీజర్ రిలీజ్.. వామ్మో రష్మిక మందన్న యాక్షన్ అదరగొట్టేసిందిగా..
అనంతరం హౌస్ లో బెస్ట్ ప్లేయర్ ఎవరు అని అందర్నీ అడిగారు నాగార్జున..
దీనికి వర్షిణి – ముకేశ్ అని చెప్పింది.
అమన్ – రామ్ ప్రసాద్
షాలిని – రోహిత్
త్రిగున్ – వంశీ
వంశీ – త్రిగున్
రామ్ ప్రసాద్ – ముకేశ్
సుధేర్ – ముకేశ్
ఝాన్సీ – ముకేశ్
ముకేశ్ – వర్షిణి
రోహిత్ – షాలిని
చరణ్ – షాలిని
దేబ్జానీ – రామ్ ప్రసాద్
నరేష్ – రామ్ ప్రసాద్
సృష్టి – రోహిత్ అని చెప్పారు. ఎక్కువమంది ముకేశ్ బెస్ట్ ప్లేయర్ అని చెప్పడంతో బెస్ట్ ప్లేయర్ స్టార్ బ్యాడ్జ్ ముకేశ్ కి ఇచ్చారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 10 లో దశావతారంలో మొదటి వారం మహాపరిక్ష, రెండవ వారం పవర్ ఆఫ్ పీపుల్ జరగ్గా మూడో వారం టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ ఉంటుందని చెప్పారు. ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ ఉండొచ్చు.
