The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సినిమాకు టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?
ది ప్యారడైజ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. (The Paradise)
The Paradise
The Paradise : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 24న ఈ సినిమా రానుంది. ఇటీవల టికెట్ రేట్లు పెంచని సినిమాలకు మంచి టాక్ వస్తే కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. బాగున్నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం ఎఫెక్ట్ అవుతుంది.
అయినా నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఈ క్రమంలో ది ప్యారడైజ్ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచారు. ది ప్యారడైజ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Also Read : Mysaa Teaser : ‘మైసా’ టీజర్ రిలీజ్.. వామ్మో రష్మిక మందన్న యాక్షన్ అదరగొట్టేసిందిగా..
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం 23 సెప్టెంబర్ సాయంత్రం 6:30 గంటలకు ఒక ప్రత్యేక షోకు 500 రూపాయలు ఫిక్స్డ్ టికెట్ ధరగా నిర్ణయించారు. 24 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేటుకు అదనంగా 48 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో అదనంగా 95 రూపాయలు పెంచుకోవచ్చు. ఇక 28 సెప్టెంబర్ నుంచి 3 అక్టోబర్ వరకు సింగిల్ స్క్రీన్స్ లో అదనంగా 23 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో అదనంగా 45 రూపాయలు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచుకునేలా త్వరలోనే అనుమతులు వస్తాయని సమాచారం.

