OPPO A7 Pro Max 5G : ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్.. 10,000mAh బ్యాటరీతో ఒప్పో A7 ప్రో Max 5G అదుర్స్, ధర జస్ట్ ఎంతంటే?
OPPO A7 Pro Max 5G : ఛార్జింగ్ టెన్షన్ అక్కర్లేదు.. భారీ బ్యాటరీతో ఒప్పో ఎ7 ప్రో మ్యాక్స్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ కొత్త మోడల్ గ్లోబల్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర ఎంతంటే?
OPPO A7 Pro Max 5G
- ఒప్పో ఎ7 ప్రో 5జీ సిరీస్ ఫోన్ లాంచ్
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్సెట్
- బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 1080p వీడియో రికార్డ్
- ఈ ఫోన్ సర్ఫింగ్ బ్లూ లూనార్ బ్లాక్ కలర్ ఆప్షన్లు
OPPO A7 Pro Max 5G : కొత్త ఒప్పో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఒప్పో A7 ప్రో మ్యాక్స్ 5జీ ఫోన్ వచ్చేసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ ఈ ఫోన్‌ను ఆగస్టులోనే దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇప్పుడు గ్లోబల్ వేరియంట్‌ను థాయ్‌లాండ్, మలేషియా ఆస్ట్రియా వంటి మార్కెట్లలో కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్లోని బ్యాటరీ హైలెట్ అని చెప్పొచ్చు. ఏకంగా 10,000mAh కెపాసిటీతో వస్తుంది.
80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. స్నాప్‌డ్రాగన్ 4వ జనరేషన్ చిప్సెట్తో వస్తుంది. రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌గా కూడా వాడుకోవచ్చు. ఒప్పో A7 ప్రో మ్యాక్స్ 5జీ గ్లోబల్ మోడల్ ధర, ఇతర ప్రత్యేక ఫీచర్లు ఏంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
గ్లోబల్ లాంచ్ ధర ఎంతంటే? :
కంపెనీ ఒప్పో A7 ప్రో మాక్స్ 5జీ ఫోన్ 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. మలేషియాలో ఈ ఫోన్ ధర MYR 2,299 (సుమారుగా రూ. 54వేలు) అందిస్తుంది. ఆస్ట్రియాలో ఒప్పో A7 ప్రో మాక్స్ 5జీ €599 (సుమారుగా రూ. 66వేలు)కు కొనేసుకోవచ్చు. థాయ్‌లాండ్‌లో ఈ ఫోన్ ధర THB 19,999 (సుమారుగా రూ. 57,500) ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను సర్ఫింగ్ బ్లూ లూనార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఒప్పో A7 ప్రో మాక్స్ 5జీ గ్లోబల్ మోడల్లో 2,772 × 1,272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 4nm ప్రాసెస్‌పై క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్సెట్తో రన్ అవుతుంది. 6GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16తో వస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. :
ఒప్పో A7 ప్రో మాక్స్ 5జీ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. వీడియో రికార్డింగ్ ఆకట్టుకునేలా ఉంటుంది. కంపెనీ 2MP సెకండరీ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం మోనోక్రోమ్ సెన్సార్ అందిస్తుంది.
ఈ ఫోన్లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు రెండింటితోనూ 30fps వద్ద 1080p వీడియోలను రికార్డ్ చేయగలదు. ఒప్పో A7 ప్రో మ్యాక్స్ 5జీలో బ్యాటరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్లో 10,000mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ 27W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ అందిస్తుంది.
ఈ ఫోన్ భారీ 10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. పవర్ బ్యాంక్‌గా కూడా వాడుకోవచ్చు. ఇతర ఫీచర్లలో ఆప్టికల్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. NFCకి కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
