Gayatri Gopichand- Treesa Jolly: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం.. రేవంత్ రెడ్డిని కలిసిన గాయత్రి-త్రిసా
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ(Gayatri Gopichand- Treesa Jolly) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Cm revanth reddy felicitates badminton champions gayatri gopichand and treesa jolly
- సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
- బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు ఘన సన్మానం
- మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్ష
Gayatri Gopichand- Treesa Jolly: ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచిన బ్యాడ్మింటన్ ఛాంపియన్లు గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ(Gayatri Gopichand- Treesa Jolly) ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపిచంద్ ఆధ్వర్యంలో క్రీడాకారులు వెళ్లగా, ముఖ్యమంత్రి వారికి ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన ఈ ఇద్దరు యంగ్ షట్లర్లను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జరిగే ప్రతిష్టాత్మక పోటీలలో మరింతగా రాణించి మరిన్ని బంగారు పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.వి లక్ష్మి పాల్గొని క్రీడాకారులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
