YS Jagan: ఏకగ్రీవాలు జరిగితే MLA సీటు దక్కదు.. పార్టీ నేతలకు జగన్ హెచ్చరిక
ఏకగ్రీవ ఎన్నికలపై జగన్(YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులకు సంచలన హెచ్చరికలు జారీ చేశారు.
Jagan warns ysrcp leaders over unanimous elections in ap
- ఏకగ్రీవాలపై జగన్ తీవ్ర ఆగ్రహం
- గట్టి పోటీకి జగన్ పిలుపు
- MLA సీటు దక్కదంటూ హెచ్చరికలు
YS Jagan: ఆంద్రప్రదేశ్ లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రాధాన్య అంశంగా భావించి ప్రతి నియోజకవర్గంలో పార్టీని సమర్థవంతంగా సిద్ధం చేయాలని వైకాపా (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వర్గాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో నిర్వహించిన కీలక భేటీలో ఆయన పాల్గొని, ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణ పొందిన అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించాలని ఆయన సూచించారు.
Bandi Sanjay: ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్
ఏకగ్రీవాలపై జగన్ కఠిన హెచ్చరికలు:
ఏకగ్రీవ ఎన్నికలపై జగన్(YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులకు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. “మీ పరిధిలోని స్థానిక సంస్థల స్థానాల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జులకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించబడుతుంది. వారు ఎమ్మెల్యే రేసులో ఉండే ప్రసక్తి లేదు” అని వైకాపా అధినేత తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి సీటులోనూ పోరాట పటిమను ప్రదర్శించి గట్టి పోటీ ఇవ్వాలని ఆదేశించారు.
