Pan Masala Raid: హైదరాబాద్‌లో భారీ పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్.. వేల కిలోల పొగాకు స్వాధీనం
హైదరాబాద్ శివార్లలో భారీ పాన్ మసాలా, పొగాకు(Pan Masala Raid) అక్రమ తయారీ కేంద్రాన్ని సెంట్రల్ జిఎస్టి హైదరాబాద్ జోన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు.
cgst hyderabad raids illegal pan masala manufacturing unit 160 crores seizes
- సీజీఎస్టీ అధికారుల మెరుపు దాడులు
- రూ.160 కోట్ల పన్ను ఎగవేత
- 14 రోజుల రిమాండ్‌లో నిందితుడు
Pan Masala Raid: హైదరాబాద్ శివార్లలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక భారీ పాన్ మసాలా, పొగాకు(Pan Masala Raid) అక్రమ తయారీ కేంద్రాన్ని సెంట్రల్ జిఎస్టి (CGST) హైదరాబాద్ జోన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఒక నిర్జన ప్రాంతంలో పెద్ద టిన్ షెడ్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌పై అధికారులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని ఈ యూనిట్లో సుమారు 56 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు.
కోట్ల విలువైన సరుకు, ప్యాకింగ్ యంత్రాలు స్వాధీనం:
దాడి సమయంలో సరుకును ప్యాక్ చేసేందుకు ఉపయోగిస్తున్న 40 అక్రమ ఎఫ్ఎఫ్ఎస్ (FFS) ప్యాకింగ్ మెషీన్లతో పాటు రూ.76 లక్షల విలువైన రెడీ-టు-డిస్పాచ్ సరుకును, 5,500 కిలోల ఫినిష్డ్ స్టాక్‌ను సీజ్ చేశారు. వీటితో పాటు 2,015 కిలోల పాన్ మసాలా మిశ్రమం, 810 కిలోల రా పొగాకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్నులు ఎగవేస్తూ ఈ అక్రమ తయారీ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.160 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
కిలక సూత్రధారి అరెస్ట్ – 14 రోజుల రిమాండ్:
సరుకు రవాణాకు ఉపయోగిస్తున్న రెండు వాహనాలను, ప్యాకింగ్ మెటీరియల్‌ను, పలు కీలక పత్రాలను సీజీఎస్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా, తయారీ వెనుక ఉన్న కీలక నిర్వాహకుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కుంభకోణంలో మరికొందరు భాగస్వాములపై అధికారులు విచారణను వేగవంతం చేశారు.
