Realme 16x 5G Launch : ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త రియల్‌మి 16x 5G వస్తోంది.. 7,000mAh బ్యాటరీ అదుర్స్, లాంచ్ ఎప్పుడంటే?
Realme 16x 5G Launch : రియల్‌మి 16x 5జీ ఫోన్ ఆగస్టు 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోరీ వైట్, ఎండ్యూరెన్స్ బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.
Realme 16x 5G Launch
- మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో రానుంది
- రియల్‌మి 16x 5జీలో గేమింగ్ మరికొన్ని ఫీచర్లు
- ఆగస్టు 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది
Realme 16x 5G Launch : రియల్‌మి ఫ్యాన్స్ గెట్ రెడీ.. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి నుంచి వచ్చే వారం భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. రియల్‌మి 16x 5జీలో 7,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో రన్ అవుతుంది.
గత ఏడాదిలో లాంచ్ అయిన రియల్‌మి 15x ఫోన్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో హీట్ మేనేజ్ కోసం 5,300 చదరపు మిల్లీమీటర్ల ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ ఉంటుంది. రియల్‌మి 16x 5జీలో గేమింగ్ కోసం కొన్ని ఫీచర్లు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
ఆగస్టు 12నే భారత మార్కెట్లో లాంచ్ :
దేశీయ మార్కెట్లో రియల్‌మి వెబ్సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ల్యాండింగ్ పేజీలను క్రియేట్ చేసింది. రియల్‌మి 16x 5జీ ఫోన్ ఆగస్టు 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోరీ వైట్, ఎండ్యూరెన్స్ బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. రియల్‌మి 16x 5జీలో వర్టికల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ బ్యాటరీ 156.2 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 9 గంటల వరకు గేమింగ్ అందిస్తుందని రియల్‌మి పేర్కొంది.
స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 256GB స్టోరేజ్ ఉంటుంది. ఇందులో రియల్‌మి ఫ్లక్స్ ఇంజిన్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ టాప్ బ్రైట్నెస్ స్థాయికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో గేమింగ్ కోసం కొన్ని ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మి 16x 5జీలో హీట్ మేనేజ్మెంట్ కోసం 5,300 చదరపు మిల్లీమీటర్ల ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ ఉంటుంది.
గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియల్‌మి జీటీ బూస్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ అందిస్తుంది. రియల్‌మి 16x 5జీ ఫోన్ బ్యాక్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించి కొన్ని ఫీచర్లు ఉంటాయి.
గత ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన రియల్‌మి 15X 5జీ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,200 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందించే 6.8-అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే (1,570 × 720 పిక్సెల్స్)తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి యూఐ6.0పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
