Samsung Galaxy A38 Launch : శాంసంగ్ నుంచి మరో అదిరిపోయే 5G ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా హైలెట్ అంతే..!
Samsung Galaxy A38 Launch : శాంసంగ్ గెలాక్సీ A38 అతి త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 6,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు, పెరగనున్న ధరపై పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
Samsung Galaxy A38 Launch
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్
- శాంసంగ్ గెలాక్సీ A38లో హై కెపాసిటీతో బ్యాటరీ ఉండొచ్చు
- గత మార్చిలో శాంసంగ్ గెలాక్సీ A37కు అప్‌గ్రేడ్ వెర్షన్
Samsung Galaxy A38 Launch : సౌత్ కొరియా కంపెనీ శాంసంగ్ అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ A38 ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని అంచనా. ఈ ఏడాది మార్చిలో భారత మార్కెట్లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ A37కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. అయితే, రాబోయే ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది..
మీడియా రిపోర్టు ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A38 గత మోడల్ కన్నా హై కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,882mAh బ్యాటరీ ఉంటుందని అంచనా.. 6,000mAh కెపాసిటితో మార్కెట్లోకి రావొచ్చు..
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
కంపేర్ చేస్తే.. శాంసంగ్ గెలాక్సీ A37లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
Read Also : Apple iPhone 18 Series : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 18, 18eలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్!
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో పాటు, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆసమ్ లావెండర్, ఆసమ్ చార్కోల్, ఆసమ్ గ్రేగ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది.
కెమెరా ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ బ్యాక్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా, 5MP మాక్రో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. శాంసంగ్ గెలాక్సీ A58 5జీ కూడా అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ A57 5జీకి అప్ గ్రేడ్ వెర్షన్ గా రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ A58 5జీ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ సహా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు..
