Itel Ace 3 Heera Feature Phone : రూ. 949కే కొత్త ఐటెల్ Ace 3 హీరా.. బ్లూటూత్, కాల్ రికార్డింగ్, వైర్లెస్ FMతో అదిరే ఫీచర్ ఫోన్!
Itel Ace 3 Heera Feature Phone : ఐటెల్ కంపెనీ భారత మార్కెట్లో Ace 3 హీరా ఫీచర్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్లో టైప్-సి ఛార్జింగ్, 1000mAh బ్యాటరీ, బ్లూటూత్, వైర్లెస్ ఎఫ్ఎమ్, ఆటో కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Itel Ace 3 Heera Feature Phone
- ఐటెల్ ఏస్ 3 హీరా ఫీచర్ ఫోన్ రూ. 949కే లాంచ్
- టైప్-C ఛార్జింగ్, బ్లూటూత్ వైర్లెస్ FM ఫీచర్లు
- 1000mAh బ్యాటరీ, సూపర్ బ్యాటరీ, 32GB వరకు స్టోరేజ్
Itel Ace 3 Heera Feature Phone : ఐటెల్ కొత్త ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. కొత్త ఐటెల్ ఏస్ 3 హీరా ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫీచర్ ఫోన్ల రేంజ్ అంతా ఇప్పుడు టైప్-C ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ కొత్త ఫోన్లో 1000mAh బ్యాటరీ, బ్లూటూత్, వైర్లెస్ FM, ఆటో కాల్ రికార్డింగ్, కింగ్ టాకర్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐటెల్ ఏస్ 3 హీరా ధర కేవలం రూ. 949 మాత్రమే.. బ్లూ, పర్పల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ ఫోన్ దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో అమ్మకానికి వస్తుంది. మాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్టింగ్ కోసం కంపెనీ ఒక ఏడాది కౌంటర్ రీప్లేస్మెంట్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఐటెల్ ఏస్ 3 హీరా స్పెషాలిటీ ఏంటంటే.. టైప్-C ఛార్జింగ్ పోర్ట్ అమర్చారు. ఫీచర్ ఫోన్లన్నీ ఇప్పుడు టైప్-C ఛార్జింగ్‌తో వస్తున్నాయి. తద్వారా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ ఫోన్ రెండింటినీ ఒకే ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్లో 1000mAh బ్యాటరీ ఉంది. AI బ్యాటరీ ఆప్టిమైజేషన్, సూపర్ బ్యాటరీ మోడ్‌కు సపోర్టు ఇస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫీచర్ బ్యాటరీ వినియోగాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేస్తుంది. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఫోన్ ఎక్కువసేపు వాడుకోవచ్చు.
కనెక్టివిటీ పరంగా ఇందులో బ్లూటూత్ ఉంది. అలాగే ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్ కాల్స్‌ను రికార్డ్ చేస్తుంది. ఈ ఫోన్లో రికార్డింగ్ ఫీచర్‌తో వైర్లెస్ FM రేడియో కూడా ఉంది. ఇయర్ఫోన్ల అవసరం ఉండదు.
ఐటెల్ ఏస్ 3 హీరాలో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. మెమరీ కార్డ్ నుంచే నేరుగా రింగ్టోన్లను సెట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌లకు ఫొటోలు లేదా ఐకాన్లను యాడ్ చేయొచ్చు. ఈ ఫోన్ కింగ్ టాల్కర్ వాయిస్ అసిస్టెంట్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ భాషలకు కూడా సపోర్టు ఇస్తుంది. 200 కాంటాక్ట్‌ల వరకు స్టోర్ చేయగలదు.
