Apple Watch Ultra : రూ.1500 లోపు ధరకే ఆపిల్ వాచ్ అల్ట్రా ఫీచర్లతో కొత్త స్మార్ట్‌వాచ్.. ఇప్పుడే కొనేసుకోండి..!
Apple Watch Ultra : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ గాడ్జెట్లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఆపిల్ ప్రొడక్టులు ప్రీమియం ధరలతోనే గ్లోబల్ మార్కెట్లోకి వస్తుంటాయి. ఆపిల్ బ్రాండ్‌కు తగినట్టుగానే డిజైన్, టెక్నాలజీ కలిగిన న్యూ-జెన్ గాడ్జెట్‌లకు మార్కెట్లో కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉంటుంది.

Apple Watch Ultra This Apple Watch Ultra look alike comes with a price under Rs 1500
Apple Watch Ultra : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ గాడ్జెట్లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఆపిల్ ప్రొడక్టులు ప్రీమియం ధరలతోనే గ్లోబల్ మార్కెట్లోకి వస్తుంటాయి. ఆపిల్ బ్రాండ్‌కు తగినట్టుగానే డిజైన్, టెక్నాలజీ కలిగిన న్యూ-జెన్ గాడ్జెట్‌లకు మార్కెట్లో కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ లేదా వాచ్ సిరీస్ ఏదైనా సరే.. Apple డివైజ్‌లు ఎల్లప్పుడూ ప్రీమియం కేటగిరీలోనే ముందుంటాయి. ఆపిల్ ప్రీమియం ధర పరిధిలో మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ కొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా (Apple Watch Ultra) భారత్‌లో రూ. 89,900 ధరతో వస్తుంది.
ఇంత ఖరీదు పెట్టి స్మార్ట్ వాచ్ కొనాలంటే సామాన్యులకే కష్టమే.. కానీ, మీరు ఆపిల్ వాచ్ అల్ట్రా మాదిరిగానే కనిపించే మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ని సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధర కేవలం రూ. 1500లోపు మాత్రమే ఉంటుంది. అంటే.. దాదాపుగా రూ. 1200 ఉండొచ్చు. భారత స్మార్ట్ వేరబుల్ బ్రాండ్ pTron ఇటీవల తన ఫోర్స్ సిరీస్‌లో ఆపిల్ వాచ్ అల్ట్రా మాదిరిగానే కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, 1.85-అంగుళాల ఫుల్-టచ్ డిస్‌ప్లే, ఫిట్‌నెస్ ట్రాకర్ ఫీచర్లు, మరిన్నింటిని అందించే కొత్త pTron Force X12Nని కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
pTron Force X12N ధర ఎంతంటే? :
స్మార్ట్‌వాచ్ బ్రాండ్ (pTron) Force X12N ధర రూ. 1499లకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం రూ. 1199 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ ఒక ఏడాది వారంటీతో వస్తుంది. బ్లేజింగ్ బ్లూ, గోల్డ్ బ్లాక్, కార్బన్ బ్లాక్ , మరియు షాంపైన్ పింక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon) నుంచి ఈ కొత్త స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.

Apple Watch Ultra This Apple Watch Ultra look alike comes with a price under Rs 1500
pTron ఫోర్స్ X12N స్పెసిఫికేషన్లు ఇవే :
ఈ స్మార్ట్‌వాచ్ pTron Force X12N దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉంటుంది.1.85-అంగుళాల TFT LCD డిస్‌ప్లేను రౌండబుల్ క్రౌన్ కలిగి ఉంది. సిలికాన్ బెల్ట్‌తో ప్రీమియం అల్లాయ్ మెటల్ కేసింగ్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ 100 కన్నా ఎక్కువ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లతో వస్తుంది. IP68 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. స్మార్ట్‌వాచ్‌లో 10 మీటర్ల వైర్‌లెస్ రేంజ్‌తో బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది. ForceX12N బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, కాంటాక్ట్ సింక్‌తో స్పీకర్, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. డయల్ ప్యాడ్‌తో కూడా వస్తుంది.
వాచ్ Android 8.0 అంతకన్నా ఆపై OS వెర్షన్, iOS 9.1, అంతకంటే ఎక్కువ OS వెర్షన్ సపోర్టు ఉన్న డివైజ్‌లకు అనుకూలంగా ఉంటుంది. 3 గంటల మాగ్నెటిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ని అందిస్తామని pTron హామీ ఇచ్చింది. స్మార్ట్‌వాచ్‌లో 5 బిల్ట్-ఇన్ గేమ్‌లు, స్మార్ట్ హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్లు, హార్ట్ రేట్ చెక్, SpO2 బ్లడ్ ఆక్సిజన్, బ్లడ్ ప్రెజర్ చెక్, స్లీప్ మానిటర్, సెడెంటరీ అలర్ట్, స్టెప్ కౌంట్, బర్న్డ్ క్యాలరీలు & 8 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అదనంగా, మెసేజ్ పుష్, రిస్ట్ సెన్స్, డోంట్ డిస్టర్బ్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఆపిల్ వాచ్ ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌ను ఇప్పుడే సొంతం చేసుకోండి.