North Korea Election : 99.93 శాతం ఓట్ షేర్ తో గెలిచిన కిమ్ జాంగ్ ఉన్.. 70 ఏళ్ల తర్వాత 0.7% వ్యతిరేక ఓట్లు.. ఇక వారి పని ఖతం..!
North Korea Election : ఉత్తర కొరియా ఎన్నికల్లో ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారు. దీంతో పాటు ఈసారి మరో అరుదైన సంఘటన జరిగింది.
North Korea Election Kim Jong Un Secures 99 93 pc vote share and 0 07 negative votes after 1957
North Korea Election : ఓవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. మరోవైపు నియంత పాలనలో కొనసాగుతున్న ఉత్తర కొరియాలో ఇటీవల పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు చారిత్రాత్మక ఘట్టంగా నిలిచాయి. కారణం ఈ ఎన్నికల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ‘వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా’ ఏకంగా 99.93 శాతం ఓట్లతో విజయాన్ని సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో కిమ్ వరుసగా మూడోసారి ఉత్తర కొరియా అధినేతగా పగ్గాలు చేపట్టబోతున్నారు.
మార్చి 15న ఈ ఓటింగ్ జరిగింది. సుమారు 99.99 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కిమ్ సాధించిన ఓట్ షేర్ కన్నా మరింత ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంది. అదే కిమ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన 0.07 శాతం మంది. కిమ్ పాలనలో అతడికి వ్యతిరేకంగా ఓటు నమోదు కావడం అసాధారణ అంశం అంటున్నారు.
ఉత్తర కొరియాలో ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ పేపర్ మీద కేవలం అధికార పార్టీ అభ్యర్థి పేరు మాత్రమే ఉంటుంది. అభ్యర్థి నచ్చితే.. ఓటరు ఆ పేరుకు మద్దతుగా ఓటు వేస్తారు. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే.. పేరును కొట్టివేయవచ్చు. అయితే ఇలా వ్యతిరేక ఓటు వేసే వారిని దేశద్రోహులుగా గుర్తిస్తారు. ఇక వారి భవిష్యత్తు గురించి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. అలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మరి కిమ్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారంటే వారి ధైర్యాన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. మరి ఈ వ్యతిరేక ఓటు వేసిన ఆ ధైర్యశాలులు ఎవరనే దానిపై ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారి సమాచారం ఇక భూమిపై ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు.
దాదాపు 70 ఏళ్ల తర్వాత అంటే.. 1957 తర్వాత ఉత్తర కొరియా అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారిగా వ్యతిరేక ఓట్లు పడినట్లు ప్రభుత్వ మీడియా తెలపడం విశేషం. ఈసారి మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా అభ్యర్థిగా పోటీ చేయలేదు.
