NoiseFit Crew Smartwatch : కేవలం రూ. 1500 లోపు ధరకే నాయిస్‌ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ సహా మరెన్నో ఫీచర్లు..

NoiseFit Crew Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? స్వదేశీ స్మార్ట్ వేరబుల్ బ్రాండ్ నాయిస్ (Noise) మరో బ్లూటూత్-కాలింగ్-రెడీ స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియోను లాంచ్ చేసింది.

NoiseFit Crew Smartwatch : కేవలం రూ. 1500 లోపు ధరకే నాయిస్‌ఫిట్ క్రూ స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ సహా మరెన్నో ఫీచర్లు..

NoiseFit Crew smartwatch launched with Bluetooth calling, priced under Rs 1500

Updated On : February 21, 2023 / 9:34 PM IST

NoiseFit Crew Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? స్వదేశీ స్మార్ట్ వేరబుల్ బ్రాండ్ నాయిస్ (Noise) మరో బ్లూటూత్-కాలింగ్-రెడీ స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియోను లాంచ్ చేసింది. నాయిస్ కొత్తగా రిలీజ్ చేసిన NoiseFit Crew స్మార్ట్‌వాచ్ 100 కన్నా ఎక్కువ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫీచర్‌లను అందించే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. అధునాతన కాలింగ్, ఫిట్‌నెస్ ఫీచర్‌లతో రౌండ్ డయల్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను కలిగి ఉంది.

ఈ కొత్త NoiseFit క్రూ లాంచ్‌పై నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి మాట్లాడుతూ.. యువ హస్లర్‌ల డైనమిక్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ కొత్త స్మార్ట్‌వాచ్ రూపొందించినట్టు తెలిపారు. ప్రతి ప్రయోగంతో తమ ప్రయత్నం వినియోగదారుల జీవనశైలికి కొత్త అప్‌గ్రేడ్‌లను అందిస్తుందని అన్నారు. ఫీచర్-రిచ్ ప్రొడక్టులను క్యూరేట్ చేసేందుకు NoiseFit సిబ్బంది ప్రీమియం డిజైన్‌లో అద్భుతమైన డిస్‌ప్లేతో పాటు అధునాతన కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని ఖత్రి పేర్కొన్నారు.

NoiseFit క్రూ ధర ఎంతంటే? :
నాయిస్‌ఫిట్ Crew భారత మార్కెట్లో రూ. 1,499 ధరకు 5 రంగులలో అందుబాటులో ఉంది. అందులో జెట్ బ్లాక్, మిడ్‌నైట్ బ్లూ, సిల్వర్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్, రోజ్ పింక్ వంటి కలర్ ఆప్షన్లు ఉన్నాయి. స్మార్ట్‌వాచ్ కొనుగోలుదారులు gonoise.com లేదా ఇ-కామర్స్ సైట్ Flipkartలో రౌండ్ డయల్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయవచ్చు.

NoiseFit Crew smartwatch launched with Bluetooth calling, priced under Rs 1500

NoiseFit Crew smartwatch launched with Bluetooth calling

NoiseFit క్రూ స్పెసిఫికేషన్ :
కొత్త NoiseFit క్రూ మోడల్ 1.38-అంగుళాల TFT రౌండ్ డిస్‌ప్లేతో 500 నిట్స్ బ్రైట్‌నెస్, 240×240-పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. వాచ్ కేసుపై మెటాలిక్ ఫినిషింగ్‌తో నాన్-AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ట్రూ సింక్ టెక్నాలజీతో మరింత కొత్తగా రూపొందింది. సింగిల్-చిప్ బ్లూటూత్ v5.3తో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్టుగా NoiseFit క్రూ ఇన్-బిల్ట్ స్పీకర్లు, మైక్రోఫోన్, నాయిస్ బజ్‌ను కూడా కలిగి ఉంది. దీని ద్వారా యూజర్లు స్క్రీన్‌పై డయల్ ప్యాడ్‌ని యాక్సెస్ చేయవచ్చు. వాచ్ నుంచి నేరుగా కాల్ చేయవచ్చు. స్మార్ట్‌వాచ్ ఇటీవలి కాల్‌లకు యాక్సెస్‌ను అందించగలదు.

స్మార్ట్‌వాచ్ మెమరీలో గరిష్టంగా 10 కాంటాక్టులను సేవ్ చేస్తుంది. NoiseFit క్రూ IP IP68 రేటింగ్‌తో వాటర్, డెస్ట్ కూడా నిరోధకతను కలిగి ఉంది. కొత్త NoiseFit క్రూ ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని నాయిస్ చెబుతోంది. ఈ స్మార్ట్ వాచ్ మాగ్నెటిక్ ఛార్జర్‌తో వస్తుంది.

అంతేకాదు.. స్మార్ట్‌వాచ్ iOS, Android స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్టు చేస్తుంది. ఫిట్‌నెస్, ఆరోగ్య ట్రాకింగ్ కోసం NoiseFit క్రూ ఇంటర్నల్ నాయిస్ హెల్త్ సూట్‌తో వస్తుంది. SPO2 స్థాయిలు, హృదయ స్పందన రేటు, నిద్ర, శ్వాస విధానాలు, యాక్టివిటీ లెవల్స్ ట్రాక్ చేస్తుంది. స్మార్ట్‌వాచ్‌లో ఫిమేల్ సైకిల్ ట్రాకింగ్, 122 స్పోర్ట్స్ మోడ్‌లు, మొత్తం హెల్త్ మానిటరింగ్, కస్టమైజ్ చేసిన ఫీచర్లతో 100+ వాచ్ ఫేస్‌లు కూడా ఉన్నాయి.

Read Also : IPL 2023 Live Stream : మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను 4Kలో ఫ్రీగా చూడొచ్చు.. మీకు నచ్చిన భాషలోనే..!