ChiruOdela: తెరపైకి చిరంజీవి- మోహన్ బాబు కాంబో.. విలన్ గా రాజశేఖర్.. సంచలనంగా మారుతున్న లేటెస్ట్ అప్డేట్
చిరు- ఓదెల(ChiruOdela) సినిమాలో విలన్ గా కనిపించనున్న టాలీవుడ్ సీనియర్ హీరోలు.
Mohan babu, rajashekar doing special roles in ChiruOdela movie
- త్వరలో సెట్స్ పైకి చిరు-ఓదెల సినిమా
- చిరు కోసం ఇద్దరు స్టార్స్ ని సెట్ చేస్తున్న డైరెక్టర్
- మరోసారి సెట్ కానున్న చిరు- మోహన్ బాబు మూవీ
ChiruOdela: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ అందించిన సక్సెస్ జోష్ లో ఉన్నాడు. అందుకే, వరుస పెట్టి వైవిధ్యమైన సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘దసరా’ చిత్రంతో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు సీనియర్ హీరోలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథ కోసం టాలీవుడ్ సీనియర్ హీరోలు రాజశేఖర్, మోహన్ బాబులను సంప్రదించినట్లు తెలుస్తోంది. చిరంజీవికి విలన్స్ గా ఈ ఇద్దరు హీరోలు అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయని టాక్ నడుస్తోంది. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ ముగ్గురు స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల(ChiruOdela) తన సినిమాల్లో పాత్రలను చాలా రా అండ్ రస్టిక్ గా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తారు.
ఈ సినిమాలో చిరంజీవి లుక్ పరంగా కూడా చాలా సరికొత్తగా కనిపించబోతున్నారట. మునుపెన్నడూ చూడని విధంగా ఆయనను ఒక మాస్ అవతారంలో చూపించేందుకు ఓదెల పక్కా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి తన 157వ చిత్రమైన ‘విశ్వంభర’ విడుదల పనుల్లో బిజీగా ఉండగా ఉన్నాడు. మరోపక్క శ్రీకాంత్ ఓదెల నానితో ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయిన వెంటనే మెగాస్టార్-శ్రీకాంత్ ఓదెల చిత్రం పట్టాలెక్కనుంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక వైపు కమర్షియల్ హంగులు, మరోవైపు శ్రీకాంత్ ఓదెల మార్కు రియలిస్టిక్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సీనియర్ హీరోల కలయికపై త్వరలోనే మరిన్ని స్పష్టమైన వివరాలు వెలువడే అవకాశం ఉంది.
