Salman Khan: సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ మార్పు.. కొత్త టైటిల్ ఏంటో తెలుసా?
సల్మాన్ ఖాన్(Salman khan) 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ టైటిల్ మార్చుతూ అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.
Salman Khan Battle of Galwan Movie Title Changed to Maatrubhumi
Salman Khan: బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా మూవీకి సంబంధించి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ఇప్పుడు పేరు మార్చారు. ఈ సినిమాను ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నట్లు సల్మాన్(Salman Khan) స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vithika Sheru: వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు.. క్యూట్ ఫోటోలు వైరల్
ఈ సినిమా కథ 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య జరిగిన వాస్తవ ఘర్షణల ఆధారంగా రూపొందుతోంది. ఈ పోరాటంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందిన 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ బి. సంతోష్ బాబు పాత్రను సల్మాన్ పోషిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తుండగా, సల్మాన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు.
అయితే, ఈ టైటిల్ మార్పునకు గల కారణాలను మేకర్స్ ప్రకటించలేదు. కానీ, కథలోని సున్నితత్వం, శాంతి సందేశాన్ని బలంగా వినిపించడమే దీని వెనుక ఉన్న కారణం అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పెట్టిన ‘యుద్ధం శాంతించాలి’ అనే ట్యాగ్‌లైన్ ద్వారా కేవలం సైనిక ఘర్షణనే కాకుండా, యుద్ధం వల్ల కలిగే మానవీయ నష్టాన్ని, సైనికుల త్యాగాలను మరింత లోతుగా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా, ఈ సినిమాలోని ‘మాతృభూమి’ అనే టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ పాట ప్రభావంతోనే సినిమాకు కూడా అదే పేరును ఖరారు చేసి ఉండవచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 17, థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
