Instagram : మెటా షాకింగ్ నిర్ణయం.. ఇన్‌స్టాలో ఈ ఫీచర్ తొలగింపు.. ఇక మీ చాట్ సేఫ్ కాదు.. ఏం చేసినా తెలిసిపోద్ది!
ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌లలోని ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించింది. మే 8, 2026 తర్వాత ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై అందుబాటులో ఉండదు.
Instagram to remove end-to-end encryption
- ఇన్స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాకిచ్చిన మెటా కంపెనీ
- ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజెస్ (DM)లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ తొలగింపు
- ఇకపై ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ అవ్వవు.
Instagram : ప్రముఖ టెక్ కంపెనీ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజెస్ (DM)లో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించింది. కంపెనీ ప్రకారం.. ఈ ఫీచర్ మే 8, 2026 తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉండదు. చాలా తక్కువ మంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారని, అందుకే ఫీచర్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెటా సపోర్ట్ పేజీ అప్డేట్లో పేర్కొంది.
యాప్‌లో ప్రైవేట్ చాట్స్ విధానంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా పంపినవారు, స్వీకరించినవారు మాత్రమే మెసేజ్ చదవగలరు. ప్లాట్‌ఫామ్ కూడా ఆ మెసేజ్ యాక్సెస్ చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో ఇన్ స్టా యూజర్లు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..
2023లో ప్రారంభం :
ది వెర్జ్ ప్రకారం.. ఇన్స్టాగ్రామ్ ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ఫీచర్‌ను డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టింది. యాప్‌లలో యూజర్ల ప్రైవసీని మెరుగుపరిచేందుకు మెటా చేపట్టిన ప్రయత్నాలలో ఒక భాగం. ఇప్పుడు, ఆ సంస్థ ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ నుంచి ఈ ఎన్క్రిప్షన్ ఫీచర్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఆ సంస్థ ప్రకారం.. ఈ ఫీచర్‌ను చాలా తక్కువ మంది మాత్రమే వాడుతుండగా అందుకే నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Read Also : Bank Account : చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్ ఎవరికీ ఎందుకు చూపించరో తెలుసా? ఫుల్ డిటెయిల్స్
యూజర్లకు ప్రైవసీ ఉంటుందా?
ఈ ఫీచర్‌ను తొలగించిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన మెసేజ్ లు ఇకపై ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ అవ్వవు. కంటెంట్ మోడరేషన్ లేదా ఇతర కారణాల వంటి అవసరమైతే మెటా మీ మెసేజ్ చూడగలదు.
ఇప్పటికే చాట్లు ఎన్‌క్రిప్ట్ చేసిన యూజర్లకు యాప్‌లో నోటిఫికేషన్ వస్తుంది. తమ పాత మెసేజ్ లు లేదా మీడియాను సేఫ్టీ కోసం గడువు తేదీ ముగియక ముందే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
అయితే, పిల్లల ఆన్లైన్ భద్రత కోసం కొన్ని ప్రభుత్వాలు, గ్రూపులు, ఎన్‌క్రిప్ట్ చేసిన చాట్ల వల్ల చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించడం కష్టమవుతుందని అంటున్నాయి. మెటా ఇప్పటికే వాట్సాప్‌లో డిఫాల్ట్‌గా ఎన్క్రిప్షన్ను అందిస్తోంది. మరింత ప్రైవసీ కోరుకునే వారిని వాట్సాప్‌లో చాట్ చేసుకోవచ్చు.
