Bank Account : చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్ ఎవరికీ ఎందుకు చూపించరో తెలుసా? ఫుల్ డిటెయిల్స్
Bank Account : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు అకౌంట్లను బయటకు చెప్పకపోవడానికి అసలు కారణాలేంటి? ఇదే విషయంలో ఆర్బీఐ, కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Bank Account
Bank Account : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు అకౌంట్లు ఏమవుతాయి? ఇంతకీ ఆ అకౌంట్లను ఎవరు మెయింటైన్ చేస్తారు. చాలామందికి ఇదే సందేహం ఉంటుంది. కొంతమంది అకౌంట్ క్లోజ్ అవుతుందని అంటారు.
అసలు ఆ విషయం బ్యాంకులకు ఎలా తెలుస్తుంది. అలాగే ఖాతాదారుడి కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి అకౌంట్ వాడుకోవచ్చా? అలా చేయాలంటే ఏం చేయాలి?
ఇలాంటే ప్రశ్నే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లను సీక్రెటుగా ఉంచాల్సిన అవసరం ఏంటి? చట్టబద్ధమైన వారసులకు ఈ వివరాలను ఎందుకు చెప్పరంటూ సుప్రీంకోర్టు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అంతేకాదు.. ఇలాంటి బ్యాంకు అకౌంట్ల వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసేలా ఒక స్పష్టమైన విధానం అమల్లోకి తీసుకురావాలని సూచించింది.
జర్నలిస్ట్ సుచేత దలాల్ దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. చనిపోయిన వ్యక్తులకు పది బ్యాంకు అకౌంట్లు ఉండి ఆ వ్యక్తి వీలునామా లేదా కేవైసీ వివరాలు కుటుంబ సభ్యులకు ఎలా తెలుస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది.
అయినా బ్యాంకు వివరాలను వారి కుటుంబ సభ్యులకు చెప్పడానికి మీకు వచ్చే ఇబ్బందలేంటో ఏదైనా మంచి విధానంతో మళ్లీ రండి అంటూ పేర్కొంది. ఈ కేసుపై విచారణనను సుప్రీంకోర్టు వచ్చే నెల మే 5కు వాయిదా వేసింది.
అసలు రీజన్ ఇదే? :
చనిపోయిన వ్యక్తి బ్యాంక్ ఖాతా వివరాలను ఇతరులకు చూపించకపోవడానికి కారణం ఖాతాదారుడి ప్రైవసీనే. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వ్యక్తిగత వివరాలను చట్టపరంగా రక్షణ కల్పిస్తాయి బ్యాంకులు. తమ కస్టమర్ల వివరాలను ఎవరికి తెలియకుండా చూడటం బాధ్యతగా బ్యాంకులు భావిస్తాయి. అందుకే ఎవరు అడిగినా వెంటనే బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పేస్తాయి.
రెండో కారణం ఏంటి? :
చనిపోయిన వ్యక్తి అకౌంట్ వివరాలను పొందాలంటే వారసులు సరైన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. డెత్ సర్టిఫికేట్, నామినీ వివరాలు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వంటివి అవసరం. ఇవి లేకుండా ఎవరికైనా వ్యక్తి ఖాతా వివరాలను ఇతరులకు ఇస్తే మోసాలు లేదా దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకులు ఇలాంటి ఖాతాల విషయంలో కఠినంగా నియమాలను పాటిస్తుంటాయి.
మూడో కారణం విషయానికి వస్తే.. మరణించిన వారి ఖాతాల్లో డబ్బు ఉండే అవకాశం ఉంటుంది. తప్పు వ్యక్తుల చేతికి ఖాతా సమాచారం వెళ్తే దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి లేకుండా బ్యాంకులు కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే వివరాలను అందిస్తాయి.
