పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టవిటీ దిశగా  భారత్ అడుగులు వేస్తోంది.

రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ కోసం మొదటిసారి 5G ట్రయల్స్‌ను ప్రారంభించింది. 

గుజరాత్‌లోని అజోల్ గ్రామంలో  ఈ 5G ట్రయల్స్ టెస్టింగ్  ప్రారంభమైంది.

అజోల్ గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ ఏర్పాటు 5G నెట్‌వర్క్‌ను టెస్టింగ్ చేశారు.

రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ స్పీడ్  ఎంత ఉంటుందో కూడా  అధికారులు లెక్కించారు. 

ఈ ట్రయల్స్ సందర్భంగా  డౌన్ లోడ్ స్పీడ్ 105.47Mbps నమోదైంది..

అప్‌లోడ్ స్పీడ్‌ 58.77Mbpsగా నమోదైనట్లు  అధికారికంగా గుర్తించారు.

నవంబర్ 19న టెలికాం శాఖకు చెందిన DoT అధికారుల బృందం 5G ఇంటర్నెట్ స్పీడ్ ట్రయల్స్ నిర్వహించింది.

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సైతం 5G నెట్‌వర్క్‌ టెస్టింగ్‌ను ప్రారంభించాయి.