Ajol Village 5G Trials: 100Mbps స్పీడ్‌తో 5G ట్రయల్స్ ప్రారంభం.. ఇండియాలోనే ఫస్ట్..!

పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టవిటీ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఇంటర్నెట్ కనెక్టవిటీ రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు చేరనుంది

Ajol Village 5G Trials: 100Mbps స్పీడ్‌తో 5G ట్రయల్స్ ప్రారంభం.. ఇండియాలోనే ఫస్ట్..!

India’s First Rural 5g Trial Starts In Gujarat's Ajol Village With Over 100 Mbps Speed (1)

Gujarat Ajol Village 5G Trials : పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టవిటీ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇప్పటివరకూ పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఇంటర్నెట్ కనెక్టవిటీ రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రానుంది. 2G తర్వాత 3G కనెక్టవిటీతో పాటు 4G కూడా వచ్చేసింది. ఇప్పుడు 5G కనెక్టవిటీపై భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ 5G నెట్‌వర్క్ కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ కోసం మొదటిసారి 5G ట్రయల్స్‌ను ప్రారంభించింది. గుజరాత్‌లోని అజోల్ గ్రామంలో (Ajol village) ఈ 5G ట్రయల్స్ టెస్టింగ్ ప్రారంభమైంది. అజోల్ గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్‌లోని ఉనావా టౌన్‌లో బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ (BTS) ఏర్పాటు నెట్‌వర్క్‌ను పరిశీలించారు.

రూరల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ స్పీడ్ ఎంత ఉంటుందో కూడా టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులు లెక్కించారు. ఈ క్రమంలోనే రెండు ప్రైవేట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీతో కూడిన బృందం అజోల్ గ్రామానికి చేరుకుంది. DDGలు రోషమ్ లాల్ మీనా, అజాతశత్రు సోమాని, డైరెక్టర్లు వికాస్ దాధిక్, సుమిత్ మిశ్రా సాంకేతిక బృందం ఇందులో ఉన్నారు. నోకియా, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL) టెక్నికల్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రయల్స్ సందర్భంగా డౌన్ లోడ్ స్పీడ్ 105.47Mbps ఉంటే.. అప్‌లోడ్ స్పీడ్‌ 58.77Mbpsగా నమోదైనట్లు అధికారికంగా గుర్తించారు.

దీనికి సంబంధించిన వివరాలను మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ట్విట్టర్‌ షేర్ చేసింది. 5G ట్రయల్స్ జరిగిన BTS స్టేషన్.. ఉనావా పట్టణానికి 17.1 కి.మీ దూరంలో అజోల్ గ్రామంలో ఉంది. అక్కడి నుంచి 105 Mbps కంటే ఎక్కువ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను గమనించినట్టు అధికారులు వెల్లడించారు. రూరల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టవిటీ కోసం భారత్‌లో నిర్వహించిన మొట్టమొదటి 5G ఇన్నొవేషన్ సొల్యూషన్ టెస్టింగ్ అని ట్వీట్‌ చేసింది. రియల్ టైమ్ వీడియో స్ట్రీమ్‌లతో కూడిన 5G ఇమ్మర్సివ్ గేమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బేస్డ్ 360 డిగ్రీస్ కెమెరాలు, VR కనెక్టెడ్ క్లాస్ రూమ్స్, 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ (VR) కంటెంట్ ప్లేబ్యాక్.. ట్రయల్ సైట్‌లో టెస్టింగ్ చేయనున్నట్టు వెల్లడించాయి.


గత నెలలో నవంబర్ 19న టెలికాం శాఖకు చెందిన DoT అధికారుల బృందం 5G ఇంటర్నెట్ స్పీడ్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ టెస్టింగ్‌లో గాంధీనగర్‌లోని మహాత్మా మండి 5G సైట్ పరిధిలో 5G స్పీడ్‌ను దాదాపు 1.5Gbpsగా గుర్తించారు. ఇప్పటికే ఇండియాలోని ప్రముఖ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సైతం 5G నెట్‌వర్క్‌ టెస్టింగ్‌ను ప్రారంభించాయి. దేశంలో 5G లాంచ్ కు సంబంధించి కచ్చితమైన టైమ్ లైన్ అంటూ ఏది లేదు.

Read Also : New Smartphone: అదిరిపోయే ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్: టెక్నో స్పార్క్ 8