Manoj Bajpayee; బాలీవుడ్ లో అభద్రతా భావం ఎక్కువ.. ఒకరిని ఒకరు ప్రశంసించుకోరు.. ఇక్కడ ఎలా ఉంటుందంటే..

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ(Manoj Bajpayee). హిందీ, తెలుగు అని భాషా బేధాలు లేకుండా సినిమా చేయడం ఆయనకు అలవాటే.

Manoj Bajpayee; బాలీవుడ్ లో అభద్రతా భావం ఎక్కువ.. ఒకరిని ఒకరు ప్రశంసించుకోరు.. ఇక్కడ ఎలా ఉంటుందంటే..

Actor Manoj Bajpayee says that Bollywood has a lot of insecurity.

Updated On : December 15, 2025 / 7:15 AM IST

Manoj Bajpayee: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ(Manoj Bajpayee). హిందీ, తెలుగు అని భాషా బేధాలు లేకుండా సినిమా చేయడం ఆయనకు అలవాటే. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ నటుడు. తాజాగా మనోజ్‌ బాజ్‌పేయీ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, ఇన్‌స్పెక్టర్‌ జెండే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఆయన రామ్ గోపాల్ వర్మ తో “పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Boyapati Srinu: పవన్ తో సినిమా చేయకపోవడమే బెటర్.. నేను అలా చేయలేను: బోయపాటి శ్రీను

ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన గురించి, తన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీలో ఒక నటుడు తన స్థానాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఒక సినిమా విజయం సాధించింది అని రిలాక్స్ అవడానికి ఉండదు. మరో అవకాశం వస్తుందా.. రాదా.. అనే ఆలోచన మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. మిగతావారి గురించి నాకు తెలియదు కానీ, నేను అలాగే ఆలోచిస్తాను. ఇక్కడ విజయం ఉంటేనే అవకాశాలు. లేదంటే, మెల్లిగా ఆ నటుడు తన ఉనికిని కోల్పోతాడు.

ఇక బాలీవుడ్ లో కొనసాగుతున్న అభద్రత గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు ఎవరిపై ప్రశంసలు కురిపించరు. ఎవరినీ ఎవరు ప్రశంశించుకోరు. బాలీవుడ్ లో అభద్రతా భావం పెరిగిపోయింది. కనీసం ఫోన్ చేసి కూడా ప్రశంసించుకోరు. కానీ, నేను మాత్రం మంచి పాత్రల కోసం అందరికీ కాల్స్ చేస్తూనే ఉంటాను. అలాగే, నా సినిమాల గురించి ప్రేక్షకులను కూడా అడిగి తెలుసుకుంటాను”అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్‌ బాజ్‌పేయీ. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి.