Boyapati Srinu: పవన్ తో సినిమా చేయకపోవడమే బెటర్.. నేను అలా చేయలేను: బోయపాటి శ్రీను

అఖండ 2తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu). నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలై ఘన విజయం సాధించింది.

Boyapati Srinu: పవన్ తో సినిమా చేయకపోవడమే బెటర్.. నేను అలా చేయలేను: బోయపాటి శ్రీను

Boyapati Srinu interesting comments about film with Pawan Kalyan

Updated On : December 15, 2025 / 6:40 AM IST

Boyapati Srinu: అఖండ 2తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం మొదటి రోజే ఏకంగా రూ.59 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. విడుదలకు ముందు కాస్త ఇబ్బందులు కలిగినా వాటిని ఆడియన్స్ ఎం పట్టించుకోలేదు. ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చేయిపిస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక బోయపాటి(Boyapati Srinu) టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మాస్, యాక్షన్ అంశాలను చూపించడంలో ఆయన పంధా వేరు. ఇక అఖండ 2లో వాణిజ్య అంశాలకు డివోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు.

Akhanda 2: ప్రధాని మోదీ ‘అఖండ 2’ చూడబోతున్నారు.. ఢిల్లీలో స్పెషల్‌ షో..

ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు బోయపాటి శ్రీను. ఈ సందర్బంగా యాంకర్ పవన్ కళ్యాణ్ తో మీరు ఎప్పుడు సినిమా చేస్తున్నారు అంటూ అడిగారు. దానికి సమాధానంగా బోయపాటి మాట్లాడుతూ..”ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ అంశాల మీద ఫోకస్ గా ఉన్నారు. సఅడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ లిమిటెడ్ డేట్స్ ఇస్తున్నారు. నేను అలా లిమిటెడ్ డేట్స్ లో సినిమాలు చేయలేను. నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నాకు హీరోల డేట్స్ బల్క్ లో కావాలి. ఇపుడు ఆయన బల్క్ లో డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు. అందుకే, నేను ఆయనతో సినిమా చేయకపోవడమే బెటర్ అనుకుంటున్నాను.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ నాకు చాలా ఉంది. కానీ, కుదరకపోవచ్చు”అంటూ తన మనసులో మాట చెప్పాడు బోయపాటి శ్రీను. ఇక ప్రస్తుతం అఖండ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇక ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు బోయపాటి. త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఢిల్లీలో అఖండ 2 ప్రత్యేక ప్రదర్శన చేస్తున్నామని చెప్పాడు. మరి అది ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి.