Honda March 2026 Offers : మిడిల్ క్లాస్‌కు పండగే.. ఈ హోండా కార్లపై రూ.1.97 లక్షల వరకూ బంపర్ డిస్కౌంట్లు.. ఏ కారు కొంటారంటే?
Honda March 2026 Offers : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హోండా మార్చి 2026 ఆఫర్లలో భాగంగా సిటీ హైబ్రిడ్, ఎలివేట్, అమేజ్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
Honda March 2026 Offers
- హోండా మార్చి 2026 ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
- సిటీ హైబ్రిడ్, ఎలివేట్, అమెజ్ కార్లపై రూ. 1.97 లక్షలు ఆదా
- మిడిల్ క్లాసు ఫ్యామిలీలకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఆప్షన్లు
Honda March 2026 Offers : కొత్త కారు కోసం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మార్చిలో లగ్జరీ కారు కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 2026 నివేదిక ప్రకారం.. కంపెనీ ప్రీమియం, సేఫ్ సెడాన్ హోండా సిటీ హైబ్రిడ్‌పై రూ.1.97 లక్షల వరకు భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.
హోండా బెస్ట్ సెల్లింగ్ మిడ్-సైజ్ SUV, ఎలివేట్, మిడిల్ క్లాసు ఫ్యామిలీలకు అమేజ్ కూడా అద్భుతమైన క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది. ఈ సీజన్లో ఏ కారు మోడల్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
హోండా సిటీ హైబ్రిడ్‌పై భారీ డిస్కౌంట్లు :
ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా సిటీ హైబ్రిడ్ (e:HEV) అడ్వాన్స్, ఫ్యూయిల్ సెడాన్లలో ఒకటి. మార్చి 2026 స్పెషల్ ఆఫర్లో భాగంగా హోండా ఈ మోడల్‌పై రూ. 1,97,000 వరకు బంపర్ డిస్కౌంట్ అందిస్తోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో లీటరుకు 27 కి.మీ కన్నా ఎక్కువ మైలేజీని కోరుకునే వారు ఈ భారీ డిస్కౌంట్ అసలు వదులుకోవద్దు.
ఈ మెగా-ఆఫర్లో నేరుగా క్యాష్ డిస్కౌంట్, పాత వాహనం ఎక్స్ఛేంజ్ కోసం భారీ ఎక్స్ఛేంజ్ బోనస్, హోండా కస్టమర్లకు స్పెషల్ లాయల్టీ బోనస్ ఉన్నాయి. సిటీ హైబ్రిడ్ అడ్వాన్స్ అడాస్ సేఫ్టీ ఫీచర్లతో సుదీర్ఘ ప్రయాణాలకు దేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో టాప్ ప్లేసులో కొనసాగుతోంది.
హోండా ఎలివేట్, అమేజ్‌పై భారీ డిస్కౌంట్లు :
హోండా SUV కారు కొనాలనుకుంటే.. హోండా రూ. 85వేల వరకు మొత్తం బెనిఫిట్స్ అందిస్తోంది. హోండా నుంచి వచ్చిన ఈ పవర్ఫుల్ SUV అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్, వైడ్ క్యాబిన్ స్పేస్‌కు పాపులర్. ఈ మార్చి బంపర్ ఆఫర్లో కంపెనీ రూ. 50వేలు నేరుగా క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 35వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.
మారుతి డిజైర్‌కు గట్టి పోటీదారుగా హోండా అమేజ్ ఈ నెలలో రూ. 72వేల వరకు అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. అమేజ్ క్లాస్-లీడింగ్ బూట్ స్పేస్, స్మూత్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు బెస్ట్ ఆప్షన్. హోండా అమేజ్ కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.40వేలు క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ అందిస్తోంది.
హోండా సిటీ పెట్రోల్ మోడల్‌పై బంపర్ డిస్కౌంట్లు :
హోండా ఐకానిక్ సెడాన్ సిటీ ఐదో జనరేషన్ పెట్రోల్ మోడల్ కూడా ప్రస్తుతం రూ. 1.15 లక్షల వరకు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇందులో రూ. 60వేలు ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. హ్యుందాయ్ వెర్నా, వోక్స్వ్యాగన్ వర్టస్తో పోలిస్తే సరసమైన ప్రీమియం ఆప్షన్ అందిస్తోంది.
హోండా సిటీ లగ్జరీ ఇంటీరియర్, పవర్ఫుల్ VTEC ఇంజిన్‌తో వస్తుంది. ఈ మార్చి 2026 ప్రత్యేక ఆఫర్లలో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుంది. మీరు సెడాన్ లవర్స్ అయితే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
