Chiranjeevi : చిరంజీవి కెరీర్ని మార్చేసిన సినిమా.. ఖైదీ కాదు.. స్టార్ డైరెక్టర్ తో మొదటిసారి.. డైలాగ్స్ లేకుండానే..
ఆయన మీద ఎంత బడ్జెట్ పెట్టాలి, ఓపెనింగ్స్ ఎంత వస్తాయని నిర్మాతలు ఆలోచించారు. (Chiranjeevi)
Chiranjeevi
- చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా
- ఖైదీ కాకుండా ఇంకేంటో తెలుసా
- ఇంటర్వెల్ వరకు హీరోకి డైలాగ్స్ కూడా లేకుండానే
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని నెంబర్ 1 స్థానంలో ఏలారు. చిరంజీవి కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ ఖైదీ సినిమానే. 1983లో ఖైదీ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కానీ ఖైదీ తర్వాత కూడా మెగాస్టార్ సినిమాలకు ఇబ్బంది పడ్డారు. ఆయన మీద ఎంత బడ్జెట్ పెట్టాలి, ఓపెనింగ్స్ ఎంత వస్తాయని నిర్మాతలు ఆలోచించారు.
అలాంటి ఆలోచనలని పటాపంచలు చేసిన సినిమా అడవి దొంగ. చిరంజీవి కెరీర్ హిట్స్ లో ఈ సినిమా ఒకటి. చిరంజీవి కెరీర్లో మొదటిసారి భారీ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా ఇది. ఖైదీ సినిమాకు మించి ఓపెనింగ్స్ వచ్చాయి. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చిరంజీవి – రాఘవేంద్రరావు కాంబోలో మొదటిసారి తెరకెక్కిన సినిమా ఇదే.
Also Read : Mrithyunjay : ‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ.. మొదటిసారి శ్రీవిష్ణు చేసిన థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే..
ఇందులో చిరంజీవి టార్జాన్ లాంటి పాత్ర పోషించారు. ఈ సినిమాలో రాధ, శారద హీరోయిన్స్ గా నటించారు. అసలు ఈ సినిమాలో చిరంజీవికి ఇంటర్వెల్ వరకు డైలాగ్స్ ఉండవు. మాస్ హీరోతో డైలాగ్స్ లేకుండా అని మనం ఇప్పుడు సలార్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అప్పట్లోనే అడవి దొంగ లో రాఘవేంద్రరావు ఈ ప్రయోగం చేసారు. ఇంటర్వెల్ నుంచే చిరంజీవికి డైలాగ్స్ ఉంటాయి. అప్పట్లో ఈ విషయంపై చిరు ఫ్యాన్స్ అసహనం కూడా వ్యక్తం చేసారు.

1985లో వచ్చిన అడవి దొంగ భారీ హిట్ అయింది. వంద రోజులు ఆడింది ఈ సినిమా. ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చి నిర్మాతలకు చిరంజీవి మీద నమ్మకం కలిగేలా చేసింది. దాంతో చిరంజీవి మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టొచ్చు అని నమ్మారు. అక్కడ్నుంచి మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకెళ్లారు.
Also Read : Saraswathi : ‘సరస్వతి’ మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎలా ఉందంటే..?
