Mrithyunjay : ‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ.. మొదటిసారి శ్రీవిష్ణు చేసిన థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే..
మృత్యుంజయ్ సినిమా మార్చ్ 6న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. (Mrithyunjay Movie Review)
Mrithyunjay Movie Review
Mrithyunjay Movie Review : శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘మృత్యుంజయ్’. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాణంలో హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రెబా మోనికా హీరోయిన్ గా నటిస్తుండగా సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య, సిజు, చిన్నా, బేబీ ఊహ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. మృత్యుంజయ్ సినిమా మార్చ్ 6న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
జై(శ్రీవిష్ణు) ఓ పేపర్ లో శ్రద్ధాంజలి యాడ్స్ తీసుకొచ్చే పని చేస్తూ ఉంటాడు. దీంతో ఎవరు చనిపోయినా ఆ ఇంటికి వెళ్లి అక్కడ ఏదో ఒక మాయ చేసి యాడ్స్ తెచ్చుకుంటాడు. కానీ జై కి క్రైమ్ రిపోర్ట్రర్ గా పనిచేయాలని ఉన్నా తన పై వాళ్ళు ఒప్పుకోరు. అచ్యుత్ శర్మ(బాలాదిత్య) అనుకోకుండా చనిపోతాడు. తనకి ఒక పాప అంజలి ఉంటుంది. జై అక్కడికి కూడా వెళ్తాడు. ఆ పాపని చూసి చిన్నప్పుడు తనకి తాను గుర్తొస్తాడు. ఇది జరిగిన మూడు రోజులకు మరో చావు దగ్గరికి వెళ్తాడు. అతను ఓ కేసులో సాక్షిగా ఉండటంతో అది పోలీసులు మొదట మర్డర్ అనుకున్నా యాక్సిడెంట్ గానే చనిపోయాడని భావిస్తారు. అయితే అచ్యుత్ రావు చావు, ఈ వ్యక్తి చావు ఒకే విధంగా ఉన్నట్టు జై కి అనుమానం వస్తుంది.
ఈ కేసు డీల్ చేసే పోలీస్ ACP సీత(రెబా మోనికా జాన్)కి చెప్పినా సరిగ్గా పట్టించుకోదు. దీంతో జై ఆ కేసుని తన కోణంలో విచారిస్తూ ఉంటాడు. పాప అంజలికి దగ్గరయి తన తండ్రికి ఏం జరిగిందో చెప్తానని మాట ఇస్తాడు. జై ఈ కేసుని విచారించే కొద్దీ ఇలాంటి మర్డర్స్ చాలా జరిగాయని తెలుస్తుంది. ఇది పోలీస్ సీతకి చెప్పినా సీరియస్ గా తీసుకోదు. మరి జై ఆ హంతకుడిని పట్టుకుంటాడా? పోలీస్ సీత ఈ కేసుని సీరియస్ గా తీసుకుంటుందా? అసలు ఆ హంతకుడు ఈ మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు? ఆ హంతకుడు ఎవరు? అంజలికి ఇచ్చిన మాట జై నెరవేర్చడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Saraswathi : ‘సరస్వతి’ మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎలా ఉందంటే..?
సినిమా విశ్లేషణ..
రెగ్యులర్ గా కామెడీ సినిమాలు, అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్న శ్రీవిష్ణు మొదటిసారి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో సినిమా చేయడంతో ముందు నుంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా డేట్ విషయంలో కంఫ్యూజన్స్ రావడం, ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో జనాల్లోకి ఎక్కువ రీచ్ కాలేదు. హత్యలు జరగడం, ఆ హంతకుడిని హీరో పట్టుకోవడం.. లాంటి రొటీన్ కథే ఇది. కాకపోతే ఆ హంతకుడిని పట్టుకునే స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నారు.
ఫస్ట్ హాఫ్ లో అన్ని పాత్రల పరిచయం, జై ఇవి మర్డర్స్ అని కనిపెట్టి వాటిని విచారించడం, విలన్ కోసం వెతకడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి విలన్ సాదు – హీరో ఎదురుపడతారు. కానీ విలన్ హీరోని గుర్తుపట్టి తన కోసమే వెతుకుతున్నాడని తెలిసినా హీరో మాత్రం గుర్తుపట్టాడు. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ హీరో విలన్ ఎలా ఉంటాడో తెలియకుండా ఎలా పట్టుకుంటాడు, పోలీసులు ఏం చేసారు అని ఇంట్రెస్ట్ గా సాగుతుంది.
ఇలాంటి థ్రిల్లింగ్ లో ఉండే రెండు మూడు ట్విస్టులు బాగున్నాయి. అయితే పోలీస్ క్యారెక్టర్ మరీ డమ్మీగా ఉంటుంది. సీరియస్ కేస్ అయినా పోలీస్ సిల్లీగా తీసుకోవడం ఏంటో. సినిమాలో పోలీస్ సీన్స్ చాలా మైనస్. ఎంత హీరో కేసు డీల్ చేసినా పోలీసులను మరీ అంత డమ్మీగా చూపించాల్సిన అవసరం లేదు. అక్కడక్కడా సాగదీశారు కూడా. కూరగాయల మార్కెట్ లో జరిగే రెండు ఎపిసోడ్స్ మాత్రం సస్పెన్స్ గా బాగుంటాయి. సీరియస్ గా సాగే థ్రిల్లర్ సినిమా అయినా ఓ రెండు మూడు చోట్ల శ్రీవిష్ణు స్టైల్ కామెడీ పెట్టడానికి ట్రై చేసారు. ఎలాంటి లవ్ స్టోరీ లేకపోవడం, సినిమా నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
కామెడీతో, ఎమోషనల్ పాత్రల్లో ఇన్నాళ్లు మెప్పించిన శ్రీవిష్ణు మొదటిసారి కొత్తగా కాస్త సీరియస్ గా కనిపించి మెప్పించాడు. పోలీస్ పాత్రలో రెబా మోనికా బాగానే నటించింది కానీ ఆ పాత్రని ఇంకా పవర్ ఫుల్ గా చూపించాల్సింది. విలన్ పాత్రలో నటించిన నటుడు చాలా బాగా నటించాడు. సుదర్శన్, రచ్చ రవి అక్కడక్కడా నవ్వించినా ఫ్రెండ్స్ పాత్రల్లో మెప్పించారు. బాలాదిత్య గెస్ట్ రోల్ లో చాన్నాళ్లకు సినిమాల్లో కనిపించాడు. అయ్యప్ప శర్మ, ఐశ్వర్య, సిజు, కృష్ణ కౌశిక్, చిన్నా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Saraswathi : ‘సరస్వతి’ మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎలా ఉందంటే..?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పర్వాలేదు. థ్రిల్లర్ క్రైమ్ కథని కొత్తగా తీసుకొని రెగ్యులర్ స్క్రీన్ ప్లేతో బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘మృత్యుంజయ్’ సినిమా శ్రీవిష్ణు మొదటిసారి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో బాగానే మెప్పించాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
