Hot Summer: మండిపోతున్న ఎండలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఇళ్ల నుంచి బయటికి వెళ్లే వారు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు తాగాలని డాక్టర్లు సూచించారు.
Representative Image (Image Credit To Original Source)
- తెలంగాణలో మండిపోతున్న ఎండలు
- పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
Hot Summer: అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ మంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. సమ్మర్ సెగలు పుట్టిస్తోంది. తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఇవాళ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
సిద్దిపేట, జనగామ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట మినహా మిగతా అన్ని జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. ఇళ్ల నుంచి బయటికి వెళ్లే వారు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు తాగాలని డాక్టర్లు సూచించారు. ఎండ నుంచి రక్షణ పొందేలా గొడుగులు, క్యాప్ లు వాడాలన్నారు. బయటకు వెళ్లిన సమయంలో ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా చూసుకోవాలన్నారు.
Also Read: ఇండియాపై యుద్ధం ఎఫెక్ట్.. గ్యాస్ ఆపేసిన ఖతార్.. రేట్లు ఏ రేంజ్ లో పెరుగుతాయో..!
