RBI Assistant Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RBIలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. జాబ్ కొడితే లైఫ్ సెటిల్
RBI Assistant Jobs 2026: నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ వివరాలు...
RBI notification for 650 Assistant posts exam date elijability application fee full details
RBI Assistant Jobs 2026: మన సమాజంలో చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ఏళ్ల తరబడి వాటి కోసం చదువుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందునా బ్యాంకు కొలువుల కోసం ఎదురుచూసే వారికి ఇది శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో భారీగా కొలువుల భర్తీకి సిద్ధమయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి అర్హులు. ఆర్బీఐలో జాబ్ కొడితే ఇక లైఫ్ సెటిల్ అయినట్లే. ఈ ఉద్యోగం సాధిస్తే నెలకు సుమారు రూ. 78 వేల వరకు జీతం పొందే అవకాశం ఉంది. ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 650 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. మార్చి 8వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఆర్బీఐ భర్తీ చేస్తున్న ఈ అసిస్టెంట్ కొలువుల్లో అత్యధికంగా ముంబైలో 249 పోస్టులు ఉండగా, హైదరాబాద్ కార్యాలయంలో 11 పోస్టులు ఉన్నాయి.
అర్హత, ఏజ్ లిమిట్
అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే, 20-28 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ (PwBD) తదితర వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. ముందుగా వారికి ప్రిలిమ్స్, ఆపై మెయిన్స్, చివరగా భాషా నైపుణ్య పరీక్ష (లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ – LPT) నిర్వహిస్తారు. స్థానిక భాషలోని ప్రావీణ్యాన్ని అభ్యర్థులు నిరూపించుకోవాలి. ఫైనల్ లిస్ట్‌లో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ https://rbi.org.in ఓపెన్ చేసి
- ‘Opportunities@RBI’ సెక్షన్లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత ఆర్బీఐ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- వ్యక్తిగత వివరాలతో పాటు అకడమిక్ వివరాలను నమోదు చేయాలి.
- ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ గడువు
ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 2026, ఫిబ్రవరి 15 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. ఏప్రిల్ 11న ప్రిలిమినరీ ఎగ్జామ్, జూన్ 7న మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు..
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 50 + జీఎస్టీ (ఇంటిమేషన్ ఛార్జీలు)గా నిర్ణయించారు.
- ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులకు రూ. 450 + జీఎస్టీ (అప్లికేషన్ ఫీజు + ఇంటిమేషన్ ఛార్జీలు) ఉంటుంది.
ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ. 58,514లతో పాటు వివిధ అలవెన్సులు లభిస్తాయి.
