AP DSC Notification 2026 : ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో ప్రాథమిక నోటిఫికేషన్.. జిల్లాల వారిగా పోస్టుల వివరాలు ఇవే..
AP DSC Notification 2026 : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది.
AP DSC Notification 2026
AP DSC Notification 2026 : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ప్రతీయేటా డీఎస్సీ ప్రకటిస్తామని కూటమి సర్కార్ ఇచ్చిన హామీ మేరకు మరో డీఎస్సీ ప్రకటించింది. మంగళవారం రాత్రి డీఎస్సీ ప్రాథమిక (షార్ట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు వారాల్లో పూర్తిస్థాయి వివరాలతో నోటిఫికేషన్ జారీ కానుంది.
మొత్తం 2,721 టీచర్ పోస్టులతో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి మూడు వేరువేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో 2,111 పోస్టులు, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు 350, అదేవిధంగా.. సొసైటీల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులు 260 ఉన్నాయి. నవంబర్ 3వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే, దరఖాస్తులు స్వీకరించేందుకు ముందే పాఠశాల విద్యాశాఖ పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో ఖాళీలు, రిజర్వేన్లు, అర్హతలు పూర్తి వివరాలు ఉంటాయి.
అత్యధిక, తక్కువ ఖాళీలున్న జిల్లాలు..
♦ సాధారణ, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులతో కలిపి అత్యధికంగా కర్నూలు జిల్లాలో 404 ఖాళీలు (సాధారణ డీఎస్సీలో 389, ప్రత్యేక విద్యలో 15) ఉన్నాయి.
♦ ప్రకాశం జిల్లాలో 291 పోస్టులు (సాధారణ 266, ప్రత్యేక విద్య 25),
♦ వైఎస్ఆర్ కడప జిల్లాలో 227 పోస్టులు (సాధారణం 206, ప్రత్యేక విద్య 21)
♦ పార్వతీపురం మన్యంలో 15 పోస్టులు (సాధారణ 8, ప్రత్యేక విద్య 7)
♦ విజయనగరంలో 18 పోస్టులు (సాధారణ 4, ప్రత్యేక విద్య 14)
♦ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 పోస్టులు (సాధారణ 10, ప్రత్యేక విద్య 10) ఖాళీగా ఉన్నాయి.

అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయాలు..
దరఖాస్తుల ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్ష షెడ్యూల్, విద్యార్హతలు, వయోపరిమితి వంటి వివరాలు ఈ జీవోల్లో వెల్లడించలేదు. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే ఈ వివరాలపై స్పష్టత రానుంది. మూడు వారాల్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీ డీఎస్సీ–2026 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించి, పోస్టుల వారీగా అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష తేదీల వివరాలను నిర్ధారించుకోవాలి.
