UPSC Result Topers List: యూపీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్.. అల్ ఇండియా టాపర్ గా డా. అనుజ్ అగ్నిహోత్రి.. టాపర్స్ లిస్ట్ ఇదిగో
UPSC Result Topers List: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2025 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి ఆల్ ఇండియా ప్రథమ ర్యాక్ అనుజ్ అగ్నిహోత్రి సాధించారు. తొలి 20 మంది టాపర్ల వివరాలు ఇక్కడ.
UPSC CSE Final result 2025 out Anuj Agnihotri is AIR 1 here top 20 list
UPSC Result Topers List: మన దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఐఏఎస్, ఐపీఎస్. ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ప్రతి ఏటా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా యూపీఎస్సీ బోర్డు 2025 సివిల్ సర్వీసెస్ ఫలితాలను విడుదల చేసింది. తొలి 20 స్థానాల్లో నిలిచిన టాపర్ల జాబితాను వెల్లడించింది. మొత్తం 1,087 పోస్టుల భర్తీకి గాను పరీక్ష నిర్వహించగా, 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఇక ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో అనుజ్ అగ్నిహోత్రి ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించగా, తర్వాతి స్థానాల్లో రాజేశ్వరి సువే, ఆకాంష్ ధుల్ నిలిచారు.
పరీక్ష రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లోకి వెళ్లి నేరుగా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. హోమ్‌పేజీలో ఉన్న రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేస్తే ఎంపికైన అభ్యర్థుల పేర్లు, వారి రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ దాటుకుని ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని తుది జాబితా కోసం కమిషన్ ఎంపిక చేసింది.ఈ మెరిట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న వారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత దేశంలోని వివిధ పరిపాలనా విభాగాల్లో కీలక బాధ్యతలు చేపడతారు. వీరిని ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులతో పాటు ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి గ్రూప్-ఏ, గ్రూప్-బీ పోస్టుల్లో కూడా నియమిస్తారు.
- 1131589- అనుజ్ అగ్నిహోత్రి
- 4000040- రాజేశ్వరి సువే
- 3512521- ఆకాంష్ ధుల్
- 0834732- రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా
- 0409847- ఈషాన్ భట్నాగర్
- 6410067- జినియా అరోరా
- 0818306- ఏ.ఆర్. రాజా మోహైదీన్
- 0843487- పక్షల్ సెక్రటరీ
- 0831647- ఆస్థ జైన్
- 1523945- ఉజ్వల్ ప్రియాంక్
- 1512091- యశస్వి రాజ్ వర్ధన్
- 0840280- అక్షిత్ భరద్వాజ్
- 7813999- ఆన్య శర్మ
- 5402316- సురభి యాదవ్
- 3507500- సిమ్రన్దీప్ కౌర్
- 0867445-మోనికా శ్రీవాస్తవ
- 0829589- చిత్వాన్ జైన్
- 5604518- శృతి ఆర్
- 0105602- నిషార్ దిశాంత్ అమృతలాల్
- 6630448- రవి రాజ్
కేంద్ర ప్రభుత్వం గతేడాదిజజ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేయాల్సిన 1,087 ఖాళీలను ప్రకటించింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా 2025 ఆగస్టులో రాత పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత, 2026 ఫిబ్రవరి నాటికి పర్సనాలిటీ టెస్టులు పూర్తి చేయగా.. తాజాగా నేడు తుది ఫలితాలు వెల్లడించారు.
ఈక్రమంలో యూపీఎస్సీ తన క్యాంపస్‌లోని పరీక్షా హాల్ సమీపంలో “ఫెసిలిటేషన్ కౌంటర్”ను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు తమ పరీక్షలు లేదా నియామకాలపై ఏవైనా సమాచారం, అనుమానులు ఉంటే.. పని దినాల్లో అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యక్షంగా.. లేదంటే 23385271 / 23381125 / 23098543 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని ప్రకటించింది. మరో 15 రోజుల్లోపు మార్కులను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని యూపీఎస్సీ తెలిపింది.
