Puvvada Ajay Kumar: రైతులను ముంచేశారు.. దేవుడిపై ఒట్టేసి రుణమాఫీ ఎగ్గొట్టారు.. సీఎం రేవంత్‌పై పువ్వాడ అజయ్ ఫైర్
ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Puvvada Ajay Kumar angered by CM Revanth Reddy comments at Khammam meeting
- సీఎం రేవంత్ దిగజారుడు వ్యాఖ్యలు
- అంగవైకల్యాన్ని కించపరచడం దుర్మార్గం
- హామీల అమలులో ప్రభుత్వం విఫలం
Puvvada Ajay Kumar: ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననమే సీఎం రేవంత్ రెడ్డి ఏకైక ఎజెండాగా మారిందని ఆయన మండిపడ్డారు. గతంలో ఒక రోడ్డు ప్రమాదంలో తాను ఒక కన్ను కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తన అంగవైకల్యాన్ని కించపరిచేలా మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. విషయ పరిజ్ఞానం లేకనే ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, తాత్కాలిక సంతృప్తి కోసమే ఈ విమర్శలని ఆయన(Puvvada Ajay Kumar) కొట్టిపారేశారు.
Cooking Oil Prices: భగ్గుమంటున్న వంట నూనెల ధరలు.. ఏడాదిలో 12.8% పెరుగుదల.. రానున్న రోజుల్లో..
ఒంటి కన్నుతోనే అభివృద్ధి:
తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఒంటి కన్నుతోనే ఖమ్మం జిల్లాను ఎంతో గొప్పగా అభివృద్ధి చేశానని, గోదావరి వరదల సమయంలో పకడ్బందీగా సమీక్షలు నిర్వహించానని పువ్వాడ స్పష్టం చేశారు. “ఒక్క కంటితో నేను చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. మరి ఇప్పుడున్న ముగ్గురు మంత్రులు ఆరు కళ్లతో ఏం సాధించారు?” అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మరీ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని, మూడు సీజన్ల రైతు భరోసాను ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా సీఎం కేవలం డొంకతిరుగుడు మాటలతో ప్రజలను నమ్మిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రయోజనాలకు గండి:
తెలంగాణ ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస చిత్తశుద్ధి లేదని పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు కోసం రూ.9,000 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేస్తే, ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తానే ఆ ప్రాజెక్టును తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ, ప్రభుత్వం నీటిని వదలకుండా రైతులను నిండా ముంచుతోందని మండిపడ్డారు. గోదావరిని కృష్ణా నదిలో కలపాలని కేసీఆర్ కృషి చేస్తుంటే, ఇక్కడ నీళ్లు వృథాగా దిగువకు పోతున్నా పట్టించుకోకుండా, ఏపీలో చంద్రబాబు పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోసుకుంటున్నా రేవంత్ సర్కార్ చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు.
