OnePlus N6x Launch : ఛార్జింగ్ టెన్షన్ లేదు.. 7000mAh బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ N6x ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
OnePlus N6x Launch : భారత మార్కెట్లోకి కొత్త వన్‌ప్లస్ N సిరీస్ ఫోన్ వన్‌ప్లస్ N6x లాంచ్ అయింది. 13-మెగాపిక్సెల్ కెమెరా 7000mAh బ్యాటరీతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ధర పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
OnePlus N6x Launch
- ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ ప్రాసెసర్
- 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ సెటప్
- వన్‌ప్లస్ N6xలో 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
OnePlus N6x Launch : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం వన్‌ప్లస్ రెండో N-సిరీస్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6x ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఇందులో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ఉంది. 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. వన్‌ప్లస్ N6x ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ N6x ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ N6x ఫోన్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా (OnePlus N6x Launch) ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 1,500 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
భారత మార్కెట్లో ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. కస్టమర్లు ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ బర్గండీ రెడ్ ఐస్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also : Apple iPhone 17 Pro Max : ఖతర్నాక్ ఆఫర్ మావా.. ఈ ఐఫోన్ 17 ప్రో మాక్స్ మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్..!
వన్‌ప్లస్ N6x ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ N6xలో 720×1570 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 19.6:9 యాస్పెక్ట్ రేషియో 900 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల HD+ LCD టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేలో వివిడ్ నాచురల్ స్క్రీన్ కలర్ మోడ్లు, డార్క్ మోడ్, స్క్రీన్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ సపోర్ట్ ఐ ప్రొటెక్షన్ మోడ్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16పై రన్ అవుతుంది.
ఈ వన్‌ప్లస్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ చిప్సెట్తో రన్ అవుతుంది. ఇందులో 4GB ర్యామ్, 64GB/128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్లో థర్మల్ మేనేజ్మెంట్ కోసం 13,280 చదరపు మిల్లీమీటర్లతో హీట్ తగ్గించే వేపర్ ఛాంబర్ కూలింగ్ సొల్యూషన్ ఉంది. తద్వారా ఫోన్ వేడెక్కదు.. పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
వన్‌ప్లస్ N6x బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్ 10x వరకు డిజిటల్ జూమ్‌తో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
వన్‌ప్లస్ N6x ఫోన్ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కొలతల పరంగా 166.38mm పొడవు, 78.13mm వెడల్పు, 8.65mm మందంతో సుమారుగా 214 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ MIL-STD-810H మన్నికతో వస్తుంది.
