Ritika Nayak : విశ్వక్ సేన్ సినిమాపై రితిక నాయక్ కామెంట్స్.. బాధపడ్డాను అంటూ..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Ritika Nayak)
Ritika Nayak
Ritika Nayak : వరుస హిట్స్ తో దూసుకుపోతుంది రితిక నాయక్. విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత హాయ్ నాన్నలో గెస్ట్ పాత్ర చేసింది. ఆ తర్వాత మిరాయ్ సినిమాతో హిట్ కొట్టింది. ఈ మూడు సినిమాలు మంచి విజయం సాధించాయి. త్వరలో కొరియన్ కనకరాజు సినిమాతో రాబోతుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రితిక నాయక్.
Also Read : Supritha : పాపం సుప్రీత లవ్ స్టోరీ.. బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యను లవ్ చేస్తే..
రితిక నాయక్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా ప్రమోషన్స్ లో నేను పాల్గొనలేదు. మొదట నన్ను పిలవలేదు కూడా. నా టీమ్ అంతా ప్రమోషన్స్ చేస్తుంటే నేను ఇంట్లో ఉన్నాను. దాంతో ఈ విషయం నా ఫ్రెండ్ దగ్గర చెప్పుకొని చాలా బాధపడ్డాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక నా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. అందరూ నా పాత్ర గురించి మాట్లాడారు. నా పాత్రను సర్ ప్రైజ్ గా దాచి ఉంచాలనే టీమ్ నన్ను ప్రమోషన్స్ కి పిలవలేదని తర్వాత అర్ధమయింది. కొన్నిసార్లు ఓర్పుతో ఉండటం వల్ల కూడా ఫలితం వస్తుందని అప్పుడు తెలుసుకున్నాను అని తెలిపింది.
అసలు ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే.. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ అనే ప్రచారం చేసారు. కానీ సినిమాలో రుక్సార్ కొద్దిసేపే ఉంటుంది. మెయిన్ హీరోయిన్ రితిక నాయక్. ఈ సినిమాలో రితిక తన పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఈ సినిమాకు రితికకు చాలా ప్రశంసలు వచ్చాయి. రితిక నాయక్ ని ప్రమోషన్స్ కి పిలవకుండా దాచి ఉంచడం వల్ల సినిమాలో ఆ పాత్ర మరింత క్లిక్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ప్రమోషన్స్ లో కనిపించింది రితిక నాయక్. మొత్తానికి మొదటి సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోవడం వాళ్ళ రితిక నాయక్ కి చాలా ప్లస్ అయిందనే చెప్పొచ్చు.
Also Read : Vaishnavi Chaitanya : లండన్లో ఎంజాయ్ చేస్తున్న ‘బేబీ’.. వైష్ణవి చైతన్య సింపుల్ లుక్స్..
