IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ నేడే.. సౌతాంప్టన్‌లో పిచ్ ఎలా ఉండబోతుంది?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా నేడు ఐదో టీ20 మ్యాచ్ (IND vs ENG) జరగనుంది.
IND vs ENG 5th t20 How will the pitch in Southampton
- నేడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మద్య ఐదో టీ20 మ్యాచ్
- సౌతాంప్టన్ పిచ్ పై సర్వత్రా ఆసక్తి
- భారత్ వైట్‌వాష్ నుంచి తప్పించుకుంటుందా?
IND vs ENG : టీమ్ఇండియా మరో వైట్‌వాష్ ముంగిట నిలిచింది. ఐర్లాండ్ చేతిలో 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కంగుతున్న భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో వైట్‌వాష్ ముప్పును ఎదుర్కొంటుంది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి పరువు దక్కించుకుంటుందా? లేదా వైట్ వాష్‌తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటుందా? అన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఇది ఐదో టీ20 మ్యాచ్ కోసం భారత్.. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాల్సి ఉంది. క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇంగ్లాండ్.. ఈ సిరీస్‌లో టీమ్ ఇండియాకు నాలుగో ఓటమిని రుచిచూపించాలని ఆరాట పడుతోంది. గత మ్యాచ్‌ల్లో లాగానే బంతి, బ్యాట్‌తో భారత్‌ను కట్టడి చేయాలని భావిస్తోంది.
Gautam Gambhir : బీసీసీఐ టార్గెట్ గంభీర్ కానే కాదు.. అప్పటి వరకు హెడ్‌కోచ్‌గా అతడే..
ఈ క్రమంలో సౌతాంప్టన్‌లో పిచ్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు.
సాధారణంగా సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. బ్యాటర్లు విజృంభిస్తే భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ పిచ్ పై 200+ స్కోరును సురక్షితంగా విశ్లేషకులు చెబుతున్నారు.
తుది జట్ల అంచనా..
ఇంగ్లాండ్..
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
భారత్..
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/సూర్యాంశ్ షెడ్జ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
