Ajay Ghosh-Ravi Teja: వామ్మో రవితేజకు వందల కోట్ల విలువ చేసే తోట.. ఎన్ని ఎకరాలు తెలుసా? బయటపెట్టిన అజయ్ ఘోష్..
Ravi Teja: ఇరుముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ స్టేజిపై మాట్లాడుతూ రవితేజ కి ఉన్న ఓ తోట గురించి వ్యాఖ్యలు చేసారు.
Ajay Ghosh Revealed Ravi Teja Property Value
Ravi Teja: సినీ సెలబ్రిటీలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటారని తెలిసిందే. సీనియర్ నటీనటులు అయితే గతంలో సినిమాలు చేసి సంపాదించినప్పుడే పలు రకాల పెట్టుబడులు పెట్టి వారి ఆస్తుల విలువని పెంచుకున్నారు. చాలా మంది భూముల మీద కూడా పెట్టుబడి పెట్టగా ఇప్పుడు వాటి విలువ భారీగా పెరిగింది. అలాంటి లిస్ట్ లో రవితేజ కూడా ఉన్నాడు.
తాజాగా ఇరుముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ సినిమాలో నటించిన అజయ్ ఘోష్ స్టేజిపై మాట్లాడుతూ రవితేజ కి ఉన్న ఓ తోట గురించి వ్యాఖ్యలు చేసారు.
Also Read : Sunil Reddy : సూర్యకు బావగా నటించి నవ్వించిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఒకప్పుడు వీళ్ళ నాన్న చిరంజీవికి..
అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. నేను, రవితేజ కలిసి మాస్ జాతర సినిమా చేసాము. ఆ సినిమాకు రైల్వే స్టేషన్ సెట్, ఇల్లు సెట్ ఒక తోటలో వేశారు. శంకరపల్లి దగ్గర 26 ఎకరాలు తోట అది. ఆ తోట రవితేజ గారిదే. ఎప్పుడో దాన్ని 12 లక్షలకు కొన్నారు. ఇప్పుడు దాని విలువ వందల కోట్లు ఉంది. సెట్ లో ఓ రోజు మాట్లాడుకుంటూ ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి రవితేజని ఈ తోట అన్ని కోట్లు విలువ అంట కదా అని అడిగాడు. దానికి రవితేజ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి మనం పోతాం. ఇవన్నీ ఉన్నాయని సంతోషించాలి కానీ పని చేసుకోవాలి అని చెప్పినట్టు తెలిపారు. దీంతో రవితేజకు కూడా భారీగానే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది.
