Sunil Reddy : సూర్యకు బావగా నటించి నవ్వించిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఒకప్పుడు వీళ్ళ నాన్న చిరంజీవికి..
ఈ సినిమాలో సూర్యకు బావ పాత్రలో సునీల్ రెడ్డి అనే నటుడు నటించారు.(Sunil Reddy)
Sunil Reddy
Sunil Reddy : సూర్య, మమిత బైజు జంటగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఇటీవల ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాలో సూర్యకు బావ పాత్రలో సునీల్ రెడ్డి అనే నటుడు నటించారు. సినిమాలో సునీల్ రెడ్డి బాగానే నవ్విస్తారు. ఈయన పాత్ర కూడా వైరల్ అవుతుంది.
అయితే ఈ సునీల్ రెడ్డి ఎవరో కాదు. స్టార్ దర్శకుడి కొడుకు. ఒకప్పుడు చిరంజీవికి ఖైదీ, అభిలాష, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ముఠామేస్త్రి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు. లెజెండరీ దర్శకుడు కోదండ రామిరెడ్డి – చిరంజీవి కాంబోలో దాదాపు 20 కి పైగా సినిమాలు వచ్చాయి. అందులో 90 శాతం హిట్ సినిమాలే.
Also See : Bandla Ganesh : బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. పెళ్లి మండపం చూశారా..? బాహుబలి రేంజ్ లో సెట్స్ వేసి..
అలంటి స్టార్ దర్శకుడి కొడుకే ఈ సునీల్ రెడ్డి. సునీల్ రెడ్డి 2018 లో విజయ్ సేతుపతి సీతకత్తి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. డాక్టర్, బీస్ట్, జైలర్, మమన్నన్, పెరుసు.. లాంటి పలు తమిళ్ సినిమాల్లో నటించారు. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కపుల్ ఫ్రెండ్లి సినిమాలో కూడా నటించారు. ఇప్పుడు సూర్య విశ్వనాధ్ & సన్స్ సినిమాతో ఒక్కసారిగా మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో సునీల్ రెడ్డికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
సునిల్ రెడ్డి తమ్ముడు, కోదండరామిరెడ్డి రెండో తనయుడు వైభవ్ తమిళ్ లో హీరోగా సినిమాలు చేస్తూనే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

Also Read : Ananya Raj : సినీ పరిశ్రమలో విషాదం.. 35 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ కన్నుమూత..
