Bhavana Lasya : నిర్మాత అవుతానంటున్న సీరియల్ భామ.. కానీ దాని కంటే ముందు..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భావన లాస్య తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. (Bhavana Lasya)
Bhavana Lasya
Bhavana Lasya : తెలుగులో మల్లి, లక్ష్మి నివాసం సీరియల్స్ తో సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి భావన లాస్య. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సీరియల్స్ చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భావన లాస్య తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Also Read : Tollywood : టాలీవుడ్ లో పెళ్లిళ్ల సందడి.. డిసెంబర్ లో కళ్యాణ వేడుకలు..
భావన లాస్య మాట్లాడుతూ.. నేను ముందు సినిమా హీరోయిన్ అవ్వాలి. ఆ తర్వాత నిర్మాత అవ్వాలి, సినిమా తీయాలి. ఆఖరి నిమిషం వరకు ఇదే పరిశ్రమలో ఉండాలి. నాకు కెమెరా ముందు ఉండటం, డ్యాన్స్ చేయడం, నటించడం ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఆయనతో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. మధ్యలో కొన్ని సినిమాలు చేయాలి కానీ అవ్వలేదు. ఛాన్సులు వచ్చాయి కానీ ఆ సమయంలో కుదరలేదు.
కమిటీ కుర్రాళ్లు సినిమాకు నన్ను పిలిచారు. ఆడిషన్ తీసుకున్నారు సెలెక్ట్ అయ్యాను. కానీ టీవీ సీరియల్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. మూడు నెలలు అడిగారు డేట్స్. కుదరక అది క్యాన్సిల్ చేసుకున్నాను. చాలా మంది అడుగుతున్నారు సినిమాల్లో నటించడానికి. కానీ అవి ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. అందుకే చేయలేకపోతున్నాను డేట్స్ అడ్జస్ట్మెంట్ వల్ల. కానీ త్వరలో చేయాలి ఎలాగైనా. నేను హీరోయిన్ అయితే డబ్బులు సంపాదించి కచ్చితంగా నిర్మాతగా సినిమా చేస్తాను అని తెలిపారు. మరి భావన లాస్య కు హీరోయిన్ ఛాన్స్ వస్తుందా? తర్వాత ఈ భామ నిర్మాత అవుతుందా చూడాలి.
