Venky Atluri : నన్నెవరూ నమ్మలేదు.. సర్ సినిమా ఆపడానికి చాలామంది ట్రై చేశారు.. హిట్ డైరెక్టర్ కామెంట్స్..
తాజాగా వెంకీ అట్లూరి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. (Venky Atluri)
Venky Atluri
Venky Atluri : సినీ పరిశ్రమలో హిట్ ఫ్లాప్స్ తోనే ఎవరి జీవితం అయినా నడుస్తుంది. సినిమా హిట్ అయితే నువ్వే హీరో. ఫ్లాప్ అయితే నీ పక్కన ఉండేవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలా తన లైఫ్ లో జరిగిన సంఘటనని పంచుకున్నాడు హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. నటుడిగా ఇండస్ట్రీకి వచ్చినా తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారి మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను పర్వాలేదనిపించినా రంగ్ దే నిరాశపరిచింది.
కానీ ఆ సినిమా తర్వాత వరుసగా సర్, లక్కీ భాస్కర్, ఇప్పుడు విశ్వనాధ్ & సన్స్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మంచి కంటెంట్ తో హిట్స్ కొట్టాడు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకున్నాడు ఈ దర్శకుడు. ఈ మూడు సినిమాలను వెంకీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాణంలోనే చేసారు. తాజాగా వెంకీ అట్లూరి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
Also See : Miheeka Daggubati : తన ఆర్ట్ గ్యాలరీలో రానా దగ్గుబాటి భార్య.. మిహీక దగ్గుబాటి ఫొటోలు..
వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. రంగ్ దే సినిమా పోయాక నన్నెవరూ నమ్మలేదు. నాకెవరూ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ నాగవంశీ నమ్మారు. ఆయన నాకు సర్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. రంగ్ దే తర్వాత డైరెక్ట్ ధనుష్ తో సినిమా అనడంతో చాలా మంది సర్ సినిమా వద్దు, ఆపేయమని నాగవంశీకి చెప్పారు. ఆ సినిమాని ఆపడానికి చాలా మంది ట్రై చేసారు. కానీ నాగవంశీ నన్ను నమ్మాడు. వంశీ నమ్మినప్పుడు నా దగ్గర సక్సెస్ లేదు కానీ నమ్మాడు. ఇప్పుడు నా దగ్గర సక్సెస్ ఉందని నేను వంశీని వదిలి వెళ్ళను. అందుకే ఆయనతోనే వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు.
