Gautam Gambhir : బీసీసీఐ టార్గెట్ గంభీర్ కానే కాదు.. అప్పటి వరకు హెడ్‌కోచ్‌గా అతడే..
భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లపై టీ20 సిరీస్‌లను కోల్పోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భవిష్యత్తు తీవ్ర చర్చనీయాంశంగా మారింది
Gautam Gambhir remains secure despite after Team India two series defeat
- వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లను కోల్పోయిన భారత్
- బీసీసీఐ అసంతృప్తి
- త్వరలోనే కీలక సమావేశం
Gautam Gambhir : ఇటీవల భారత జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లపై టీ20 సిరీస్‌లను కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుస సిరీస్‌ల ఓటముల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనుందని, అందులో భాగంగా హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్‌ను తప్పించనున్నారు అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి గౌతమ్ గంభీర్ స్థానానికి వచ్చిన ముప్పేది లేదట. అవమానకరమైన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా గంభీర్‌కు తక్షణ ప్రమాదం ఏమీ లేదని, జట్టు ఇటీవలి వైట్-బాల్ ప్రదర్శనలపైనే బీసీసీఐ సమీక్షించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైదానంలో ఏం తప్పులు జరిగాయో తెలుసుకోవడమే బీసీసీఐ ఉద్దేశ్యం అని, సహాయక సిబ్బందిలోని ఏ సభ్యుడిని తొలగించడం గురించి కాదట.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ‘ట్రిపుల్ సెంచరీ’
హెడ్ కోచ్‌గా 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ కాంట్రాక్టు ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి హెడ్ కోచ్‌ను మార్చే ప్రణాళిక ఏదీ బీసీసీఐకి లేదట. భారత పేలవ ప్రదర్శనల వెనుక గల కారణాలను అధ్యయనం చేసి, తదుపరి జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు ముందు జట్టును మెరుగుపరిచే మార్గాలను కనుగొనాలని మాత్రమే బీసీసీఐ కోరుకుంటుందని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
