TG Anganwadi Recruitment 2026 : అంగన్వాడీ ఉద్యోగాల జాతర.. జస్ట్ ఇంటర్ పాసైతే చాలు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
TG Anganwadi Recruitment 2026 : తెలంగాణలో మరో రెండు జిల్లాల్లో అంగన్వాడీ ఉద్యోగాల జాతర మొదలైంది. ఇంటర్ అర్హతతో 432 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్థానిక మహిళలకు అర్హత, ఆసక్తి ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోవడం బెటర్..
TG Anganwadi Recruitment 2026
- ఇంటర్ పాసైన మహిళలకు భారీ గుడ్ న్యూస్..
- అంగన్వాడీ జాబ్స్ బంపర్ ఛాన్స్..
- ఆదిలాబాద్, కామారెడ్డిలో 432 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రారంభం
TG Anganwadi Recruitment 2026 : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. తాజాగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా నియామకాల కోసం కొత్త నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
ఈ 2 జిల్లాల్లో కలిపి మొత్తం 432 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 242 పోస్టులు, కామారెడ్డి జిల్లాలో 190 పోస్టులు (టీచర్లు 95, హెల్పర్లు 95) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలను చేపడుతోంది.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే :
కామారెడ్డి జిల్లా :
ఎల్లారెడ్డి : 42
మద్నూర్ : 35
దోమకొండ : 41
బాన్స్వాడ : 46
కామారెడ్డి : 26
ఆదిలాబాద్ జిల్లా :
నార్నూర్ : 51
ఉట్నూర్ : 98
ఇంద్రవెల్లి : 36
గాదిగూడ : 57
అర్హతలివే :
అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ (12వ తరగతి) పాస్ అయి ఉండాలి. అర్హులైన ఇంటర్ అభ్యర్థులు లేకుంటే 10వ తరగతి పాసైన వారిని కూడా తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల వయస్సు నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లయ్ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత ప్రాంతానికి చెందిన స్థానిక మహిళలే ఉండాలి.
Read Also : Diamond Lotus : అంతరిక్షంలో వికసించనున్న వజ్ర కమలం.. విక్రమ్-1తో భారత్ కొత్త చరిత్ర!
ఎంపిక విధానం ఇదే :
అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఎంపికలో ఇంటర్ మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 10 మార్కులు ఉంటాయి. వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ మార్కులు ఉంటాయి.
అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం.. గడువులోగా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో నోటిఫికేషన్లు కూడా దశలవారీగా విడుదల చేయనున్నారు.
