AP SSC Exams 2027 : టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజుపై కీలక అప్డేట్.. ఈ తేదీలు మిస్ కావొద్దు..!
AP SSC Exams 2027 : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువులపై కీలక అప్డేట్.. నవంబర్ 26 చివరి తేదీ, రూ.50, రూ.200, రూ.500 ఆలస్య రుసుములతో ఫీజు చెల్లించే తేదీలు, పరీక్ష ఫీజు వివరాలివే..
AP SSC Exams 2027: Fee Payment Last Dates
- టెన్త్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్..
- ఫీజు చెల్లింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన
- జనవరి 4 వరకు ఫీజు చెల్లించే ఛాన్స్
AP SSC Exams 2027 : ఆంధ్రప్రదేశ్లో టెన్త్ చదివే విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 2027లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు గడువులపై పాఠశాల విద్యాశాఖ సవరించిన షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఈ తేదీలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చివరి నిమిషంలో హడావుడి పడకుండా ముందుగానే ఫీజు చెల్లించడం ఎంతైనా మంచిది..
ఫీజు చెల్లింపునకు గడువులు ఇవే :
విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26, 2026 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఒకవేళ ఈ గడువులోగా చెల్లించలేకపోతే ఆలస్య రుసుముతో మరో ఛాన్స్ ఉంటుంది.
- నవంబర్ 26, 2026 : ఆలస్య రుసుము లేకుండా
- డిసెంబర్ 8, 2026 : రూ.50 ఆలస్య రుసుముతో
- డిసెంబర్ 21, 2026 : రూ.200 ఆలస్య రుసుముతో
- జనవరి 4, 2027 : రూ.500 ఆలస్య రుసుముతో లాస్ట్ ఛాన్స్
పరీక్ష ఫీజు ఎంతంటే? :
విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులకు పరీక్ష రాస్తున్నారనే దాన్ని బట్టి ఫీజు ఉంటుంది. 3 సబ్జెక్టుల వరకు పరీక్ష రాసేవారు రూ.110 చెల్లించాలి. 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా అన్ని సబ్జెక్టులకు హాజరయ్యేవారు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే వొకేషనల్ కోర్సుల విద్యార్థులు అయితే సాధారణ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరెవరికి వర్తిస్తుంది? :
ఈ ఫీజు షెడ్యూల్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష రాసే విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. అలాగే SSC, OSSC, వొకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా ఈ షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లించాలి..
విద్యార్థులు తమ పాఠశాలల్లోనే పరీక్ష ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లిస్తే అనవసరమైన ఇబ్బందులు తప్పుతాయి. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు తమ స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించాలి..
