Gannavaram Politics : గన్నవరం టీడీపీలో ఏం జరుగుతోంది? రంగంలోకి లోకేశ్.. వారికి వార్నింగ్
Gannavaram Politics : గన్నవరం టీడీపీ అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది టీడీపీ అధిష్టానం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ రంగంలోకిదిగి అసంతృప్తులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట.
Gannavaram Politics
Gannavaram Politics : గన్నవరం టీడీపీ అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది టీడీపీ అధిష్టానం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ రంగంలోకిదిగి అసంతృప్తులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే లోకల్ లీడర్లతో మాట్లాడిన లోకేశ్.. గ్రూప్‌లకు చెక్ పెట్టాలని తేల్చి చెప్పారట. పార్టీ, ఎమ్మెల్యే వేర్వేరు కాదు.. కలిసి పనిచేసి పార్టీ పట్టును నిలబెట్టాలని సూచించారట. లోకల్ పోరులో జరిగిందేదో జరిగిపోయింది.. ముందు జరగాల్సింది చూడండి అంటూ లోకేశ్ హితబోధ చేశారట. సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని కాని.. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా రచ్చకెక్కడం ఏంటని మందలించారట. దీంతో అసలు గన్నవరం టీడీపీలో జరిగిందేంటి.? లోకేశే డైరెక్ట్‌గా ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటనే చర్చ బయలుదేరింది.
పురపోరు, పరిషత్ ఎన్నికల ఫలితాలు తర్వాత పలువురు తెలుగు తమ్ముళ్లు, కూటమి నేతలు.. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు టార్గెట్‌గా చేసిన విమర్శలు సైకిల్ పార్టీలో కాక రేపాయి. ఇటు కూటమి నేతల ఓటమి..అటు టీడీపీలోని ఓ వర్గం అసంతృప్తి, ప్రత్యర్థి వైసీపీ నేత వల్లభనేని వంశీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపుతో..ఎమ్మెల్యే సెంట్రిక్‌గా గన్నవరం పొలిటికల్ పిక్చర్ హీటెక్కింది. పలువురు టీడీపీ నేతలు అయితే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై విమర్శలు చేయడం ఇంటర్నల్ క్లాషెస్ రచ్చకెక్కాయి.
కొందరు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు పరాజయం పాలవ్వడానికి..తమ పార్టీ నేతలు అనుసరించిన విధానాలే రీజన్ అంటూ..లోకల్ టీడీపీ సీనియర్ లీడర్లు విమర్శలు మొదలుపెట్టారు. గన్నవరంలో ఓటమికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైఖరే కారణం అంటూ టీడీపీ నేతలు అటాక్ చేశారు. దీంతో టీడీపీలో ఇంటర్నల్ ఫైట్ నడిచింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన యార్లగడ్డ..వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే అలిగేషన్స్ కూడా చేశారు కొందరు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ క్యాడర్, లీడర్లు బలంగా ఉన్న గన్నవరంలో వైసీపీ అభ్యర్థులు గెలవడానికి యార్లగడ్డ ఫెయిల్యూరే రీజన్ అంటూ వాయిస్ రేజ్ చేశారు తెలుగు తమ్ముళ్లు.
వంశీ అనుచరులకు ఎమ్మెల్యే యార్లగడ్డ అండగా ఉంటున్నారని.. అందుకే వారు గెలిచారని ఇంకొందరు టార్గెట్ చేశారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవమానాలు, విమర్శలు కొత్తేమి కాదన్న.. దశాబ్దం కాలంగా తాను గన్నవరంలో ఏం చేశానో అభిమానులు, కార్యకర్తలకు తెలుసన్నారు. ఎవరు పడితే వాళ్లు ఏదొకటి మాట్లాడుతున్నారని హర్ట్ అయ్యారు. గన్నవరంలో 63 ఓట్లతో బీజేపీ జడ్పీటీసీ సభ్యుడు ఓడిపోతే తనను బాధ్యుడ్ని చేస్తున్నారని..కూటమి అభ్యర్థులు ఓడిపోవడం తనకు కూడా చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు .
గన్నవరం టీడీపీ, కూటమి నేతల విమర్శలు..ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై రియాక్షన్ కాస్త చర్చనీయాంశం అయింది. ప్రత్యర్థి వైసీపీ సహా సొంత పార్టీ నేతలు కూడా ఆయనపై విమర్శలు చేస్తూ..సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత విమర్శలు వెల్లువెత్తడం..కూటమి అభ్యర్థుల ఓటమికి ఎమ్మెల్యేనే కారణమంటూ సొంత పార్టీలోని ఒక వర్గం, అలాగే ఇతర నేతలు విమర్శలు చేయడంతో గన్నవరం పాలిటిక్స్ హీటెక్కాయి.
ఎమ్మెల్యే తీరుపై కొంతకాలంగా ఒక వర్గం అసంతృప్తిగా ఉండగా..పరిషత్ రిజల్ట్ తర్వాత ఇంకా బరస్ట్ అయిపోయారని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఇటు సొంత పార్టీ నేతల తీరును తప్పుబట్టిన యార్లగడ్డ.. అటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ ఛాలెంజ్ విసిరారు. యార్లగడ్డ వ్యాఖ్యలకు వైసీపీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు పడ్డాయి. అయితే గన్నవరం పాలిటిక్స్‌పై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ఆరా తీశారని చెబుతున్నారు. గెలుపు-ఓటములు సహజమని..ఎమ్మెల్యేపై నిందలు వేయడం మానుకోవాలని సొంత పార్టీ నేతలకు లోకేశ్ చెప్పినట్టు తెలుస్తోంది. అందరూ కలివిడిగా ఉంటూ.. వైసీపీని ఎదుర్కొనే విషయంపై ముందుకు సాగాలని ఆయన సూచించారట.
పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గ్రాఫ్ తగ్గకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారట. ఎమ్మెల్యే వర్గం..పార్టీ వర్గం అంటూ ఉండటానికి వీళ్లేదని..మంత్రి, ఎమ్మెల్యే, నియోజకవర్గం నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని లోకేశ్ తేల్చి చెప్పారని నాయకులు చెబుతున్నారు. లోకేశ్ అండగా నిలవడంతో ఎమ్మెల్యే యార్లగడ్డ బిగ్ రిలీఫ్ పొందారనే టాక్ నడుస్తోంది.
