Rajasthan : రైల్వే ట్రాక్ సమీపంలో బాంబులు కలకలం.. భారీ పేలడుకు ప్లాన్..? పాక్ హ్యాండ్లర్లతో సంబంధాలపై అనుమానాలు
Rajasthan Railway Track Bombs : రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్ సమీపంలో బాంబులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకిదిగి వాటిని నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Rajasthan Railway Track Bombs
Rajasthan Railway Track Bombs : రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్ సమీపంలో బాంబులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకిదిగి వాటిని నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, భారీ పేలుడుకు కుట్రలో భాగంగానే ఈ బాంబులు అమర్చినట్లు.. వీటి వెనుక పాక్ హ్యాండ్లర్లతో సంబంధాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Imran Khan Health : పాక్ జైలులో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి విషమం..? న్యాయమూర్తులకు అత్యవసర లేఖ
నవంబర్ 3న రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో రైల్వే పట్టాలపై పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రెండు రైల్వే స్లీపర్లు ధ్వంసమయ్యాయి. పట్టాలు దెబ్బతినడంతో పాటు సుమారు రెండున్నర అడుగుల లోతైన గుంత ఏర్పడింది. అయితే, పేలుడు జరగడానికి సుమారు 75 నిమిషాల ముందే అదే మార్గంలో అనూప్‌గఢ్ - సూరత్‌గఢ్ ప్యాసింజర్ రైలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. రైలు వెళ్లిన తర్వాత పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన మహక్దీప్ కౌర్, దేవేంద్ర సింగ్‌లను నవంబర్ 14న అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అక్టోబర్ 12, 13 తేదీల్లో కూడా రైల్వే ట్రాక్ సమీపంలో బాంబులు అమర్చినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో వారు చెప్పిన ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రామ్సింగ్పూర్–అనూప్‌గఢ్ రైల్వే మార్గానికి సమీపంలోని ఓ మజార్ దగ్గర రెండు బాంబులను గుర్తించారు. వాటిలో ఒక బాంబు అప్పటికే నిర్వీర్యం కాగా, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సహాయంతో పేలని మరో బాంబును సురక్షితంగా నిర్వీర్యం చేసి, ధ్వంసం చేశారు.
అంతకుముందే.. బాంబులు గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్తగా ప్రజల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే అధికారులకు కూడా సమాచారం అందించారు. పోలీసు ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సిబ్బంది అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటన వెనుక మరికొందరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
నవంబర్ 3న జరిగిన రైల్వే ట్రాక్ పేలుడు ఘటనలో నిందితులు పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ రైల్వే పట్టాలపై టైమర్ బాంబు అమర్చేందుకు ప్రయత్నించారని, సాంకేతిక లోపంతో అది పేలలేదని విచారణలో తేలినట్లు తెలిపారు.
#WATCH | Anupgarh, Rajasthan | Two bombs were recovered near the Ramsinghpur-Anupgarh railway track today at the instance of the two arrested accused in the November 3 railway track blast case. While one explosive device was already inactive, the live bomb was safely defused and disposed of with the help of the Bomb Disposal Squad (BDST).
Sri Ganganagar ASP and Investigating Officer Nitin Choudhary says, “It was defused and disposed of with the help of the Bomb Disposal Squad (BDST).”
— ANI (@ANI) November 16, 2026
