TGPSC Notification : టీజీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్ పడిందోచ్.. నెలకు రూ. 1.27 లక్షల వరకు జీతం.. ఈ అర్హత ఉంటే అప్లయ్ చేయొచ్చు!
TGPSC Notification : ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 7 నుంచి ఆగస్టు 12 వరకు ఆన్లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు..
TGPSC Notification
TGPSC Notification : వ్యవసాయ రంగ నిరుద్యోగులకు పండగే.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ప్రవేశపెట్టింది.
ఈ ఖాళీలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి అద్భుతమైన అవకాశం. ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఆసక్తి ఉన్నవారికి ఇదే సరైన అవకాశం..
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్ర స్థాయిలో మొత్తం 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 వరకు శాలరీ ఉంటుంది. అభ్యర్థుల వయోపరిమితి జూలై 1, 2026 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 44 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి.
Read Also : Govt Teachers : రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకూ ఫ్రీ బెనిఫిట్స్!
విద్యార్హతల విషయానికొస్తే.. :
అభ్యర్థులు ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి అగ్రికల్చర్లో బేసిక్ డిగ్రీ (B.Sc. Ag), సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ప్లాంట్ ఫిజియాలజీ కేటగిరీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎం.ఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి ఉండాలి.
అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లయ్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జూలై 7, 2026 నుంచి మొదలై ఆగస్టు 12, 2026 వరకు మాత్రమే ఉంటుంది.
ఆసక్తిగల అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ విజిట్ చేసి ప్రొఫార్మా అప్లికేషన్ ద్వారా అప్లయ్ చేయొచ్చు. సిలబస్, రిజర్వేషన్లు, పరీక్షా విధానం, ఇతర పూర్తి వివరాలకు సంబంధించి టీజీపీఎస్సీ వెబ్సైట్లో నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
