IND vs SA : సూర్యకుమార్ యాదవ్ హాట్ కామెంట్స్.. నేను ఫామ్ కోల్పేదు.. రన్స్ రావడం లేదంతే.. నెట్స్‌లో ఇరగదీస్తున్నా..
ఆదివారం ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో (IND vs SA )భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం సూర్య మాట్లాడాడు.
IND vs SA 3rd T20 Suryakumar Yadav Comments after India beat South africa
IND vs SA : తాను నెట్స్‌లో అద్భుతంగా ఆడుతున్నానని, అయితే మ్యాచ్‌లో పరుగులు చేయకపోవడం వాస్తవమేనని, అంత మాత్రన తాను ఫామ్‌లో లేనట్లు అర్థం కాదని టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఆదివారం ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం సూర్య మాట్లాడాడు.
ఈ మ్యాచ్‌లో సూర్య 11 బంతులు ఆడి రెండు ఫోర్లు బాది 12 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్ ముందు అతడి పేలవ ఫామ్ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గత 21 టీ20 మ్యాచ్‌ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శల పై సూర్య స్పందించాడు.
Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భారతీయుడు..
‘నేను నెట్స్‌లో అద్భుతంగా ఆడుతున్నాను. రన్స్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. పరుగులు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. నేను ఫామ్ కోల్పోలేదు. కానీ పరుగులు చేయని వాట వాస్తమే.’ అని సూర్య కుమార్ తెలిపాడు.
‘ఈ గేమ్ మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ఓడిపోయిన తరువాత సిరీస్‌లో ఎలా పుంజుకుంటామన్నది కీలకం. ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉండడంతో విజయం సాధించాం. కటక్‌లో ఏం చేశామో మళ్లీ అలాగే చేయాలనుకున్నాము. ఫలితం అనుకూలంగా వచ్చింది.’ అని సూర్య అన్నాడు.
ఛండీగడ్‌లో ఓడిపోయిన మ్యాచ్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు సూర్య తెలిపాడు. ‘బౌలర్లు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ తరువాత అందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నాము. బేసిక్స్‌కు కట్టుబడి ఉండాలని అనుకున్నాం. కొత్తగా ఏమీ చేయడానికి ప్రయత్నించలేదు. గెలవడం ఆనందంగా ఉంది. ఇక తదుపరి మ్యాచ్‌పైనే మా దృష్టి సారిస్తాం.’ అని సూర్య తెలిపాడు.
