Hardik Pandya : చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భార‌తీయుడు..

టీమ్ఇండియా ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Hardik Pandya : చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భార‌తీయుడు..

IND vs SA 3rd T20 Hardik Pandya scripts history 100th T20I wicket

Updated On : December 15, 2025 / 8:07 AM IST

Hardik Pandya : టీమ్ఇండియా ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన మూడో భార‌త బౌల‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అత‌డి క‌న్నా ముందు జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు ఈ ఘ‌న‌త సాధించారు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ద‌క్షిణాప్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ వికెట్‌ను తీయ‌డం ద్వారా హార్దిక్ టీమ్ఇండియా త‌రుపున 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదండోయ్‌.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా 100 వికెట్లు తీసిన తొలి భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన భార‌త ప్లేయ‌ర్లు వీరే..

* అర్ష్‌దీప్ సింగ్ – 109 వికెట్లు
* జ‌స్‌ప్రీత్ బుమ్రా – 101 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 100 వికెట్లు

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 117 ప‌రుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట‌ర్లో మార్‌క్రమ్‌ (61; 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిగిలిన వారిలో డోనోవన్ ఫెరీరా (20), అన్రిచ్ నార్ట్జే (12) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబె లు చెరో వికెట్ సాధించారు.

Cameron Green : ఐపీఎల్ వేలం పై కామెరూన్ గ్రీన్ కామెంట్స్‌.. నేనేం చేయ‌ను.. మేనేజ‌ర్ త‌ప్పు వ‌ల్లే అలా..

అనంతరం అభిషేక్‌ శర్మ (35; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (28; 28 బంతుల్లో 5 ఫోర్లు), తిలక్‌వర్మ (26 నాటౌట్‌; 34 బంతుల్లో 3 ఫోర్లు) రాణించ‌డంతో 118 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 15.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజ‌యంతో భార‌త్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.