Cameron Green : ఐపీఎల్ వేలం పై కామెరూన్ గ్రీన్ కామెంట్స్.. నేనేం చేయను.. మేనేజర్ తప్పు వల్లే అలా..
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు కామెరూన్ గ్రీన్ (Cameron Green) తన పేరును నమోదు చేసుకున్నాడు
Cameron Green clarifies manager IPL auction gaffe
Cameron Green : ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు కామెరూన్ గ్రీన్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబర్ 16న) జరగనున్న వేలం కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన 350 ఆటగాళ్ల జాబితాలో కూడా అతడి పేరు ఉంది. అయితే.. ఆల్‌రౌండర్ అయిన అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 2026 సీజన్‌లో బౌలింగ్ చేయకపోవచ్చుననే సందేహాలు వచ్చాయి. తాజాగా వాటిపై కామెరూన్ గ్రీన్ స్పష్టత ఇచ్చాడు.
ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. తన మేనేజర్ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్ విషయంలో ఆ తప్పు జరిగి ఉంటుందని తెలిపాడు. ‘నేను బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నన్ను బ్యాటర్‌గా మాత్రమే రిజిస్టర్ చేశారన్న విషయం మా మేనేజర్‌కు తెలిసి ఉండదు. పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్ ఎంపిక చేసి ఉంటాడు. ఇదెలా జరిగిందో తెలియదు.’ అని గ్రీన్ తెలిపాడు.
Lionel Messi : మెస్సీ భారత్‌లో పూర్తి స్థాయి మ్యాచ్ ఎందుకు ఆడడు? ఇన్సూరెన్స్ తో లింక్ ఏంటి?
రూ. 2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో అతడు వేలంలోకి రానున్నాడు. ఆల్‌రౌండర్ అయిన అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు పోటీపడవచ్చు. ట్రేడింగ్‌లో సాంజూ శాంసన్ కోసం సీఎస్‌కే జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు బదిలి చేసింది.
ఈ క్రమంలో సీఎస్‌కే కు ఓ నిసాకైన ఆల్‌రౌండర్ అవసరం ఎంతైనా ఉంది. దీంతో గ్రీన్ కోసం సీఎస్కే భారీ మొత్తాన్ని వెచ్చించవచ్చు.
