Gold Price Today : బంగారం ధరల్లో రాత్రికిరాత్రే భారీ ట్విస్ట్.. ఏపీ, తెలంగాణలో ఈరోజు గోల్డ్, సిల్వర్ ధరలు ఎంతంటే? ఫుల్ డీటెయిల్స్..
Gold Price Today : ఇరాన్, ఇజ్రాయెల్ వార్ మొదలైన రోజునుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే, తాజాగా గోల్డ్ రేట్లలో రాత్రికిరాత్రే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వార్ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా బాంబుల వర్షం కురిపిస్తుండగా.. ఇరాన్ సైతం ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లపై యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలపైనా యుద్ధం ప్రభావం చూపింది.

ఇరాన్, ఇజ్రాయెల్ వార్ మొదలైన రోజునుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో గడిచిన ఐదు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.11వేలు తగ్గింది. అయితే, తాజాగా బంగారం ధరల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 2,510 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.2,300 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగానే పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 75 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 5,158 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండిపై రూ.100 తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన ఐదు రోజుల్లో కిలో వెండిపై రూ. 35వేలు తగ్గుదల చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,640కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,50,000 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,63,800 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,150 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,63,640కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,50,000 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,64,180 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,50,500 వద్దకు చేరింది.

వెండి ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,89,000 వద్దకు చేరుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,85,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,89,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
