PM Modi Video : వాళ్లను వదిలే ప్రసక్తే లేదు.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. మరో వీడియో రిలీజ్..
PM Modi Video : పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026 ఆమోదం పొందడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ బిల్లు దేశంలోని పరీక్షా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చే కీలక సంస్కరణ అని ఆయన పేర్కొన్నారు.
PM Narendra Modi Praises Anti Paper Leak Bill In New Instagram Video
PM Narendra Modi Video : పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026 ఆమోదం పొందడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ బిల్లు దేశంలోని పరీక్షా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చే కీలక సంస్కరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే మాఫియాపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం బలమైన ఆయుధంగా మారుతుందని అన్నారు.
Also Read : Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
సెల్ఫీ వీడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. గతంలో పేపర్ లీక్‌లు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీశాయని గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ సమస్యను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పారు. కొత్త చట్టంతో పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం, భద్రత మరింత పెరుగుతుందని తెలిపారు.
పరీక్షా వ్యవస్థలో అక్రమాలకు పాల్పడే ముఠాలకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని మోదీ హెచ్చరించారు. విద్యార్థుల కష్టానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిజాయితీగా చదివే అభ్యర్థుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని చెప్పారు. ఈ చట్టం యువతలో పరీక్షలపై నమ్మకాన్ని మరింత పెంచుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.
Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf
— Narendra Modi (@narendramodi) July 30, 2026
కాగా.. ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా పరీక్షను మరోసారి నిర్వహించారు. ఈ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఆధ్వర్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతో నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం యాంటి పేపర్ లీక్ బిల్‌ను తీసుకొచ్చింది. ఈ బిల్లుకు పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది.
