Narendra Modi: ‘మనం చేయగలం’ మోదీ సరికొత్త నినాదం.. 25 ఏళ్ల ప్రస్థానంపై ఎమోషనల్ స్పీచ్.. ప్రత్యర్థులకు పవర్ ఫుల్ కౌంటర్!
ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల అధికారిక ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).
pm modi addresses viksit bharat sankalp sabha in delhi completes 25 years in public service
Narendra Modi: ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా వరుసగా 25 ఏళ్ల నిరంతర అధికారిక ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపారు. డిల్లీలోని ప్రసిద్ధ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయంగా తీవ్ర సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ‘మనం చేయగలం’ అనే నయా నినాదాన్ని పిలుపునిచ్చారు.
ప్రజాసేవలో 25 ఏళ్లు.. రాజకీయ విమర్శలపై పవర్ ఫుల్ కౌంటర్:
గుజరాత్ సీఎంగా మొదటిసారి ప్రమాణం చేసినప్పుడు పాతికేళ్ల పాటు నిరంతరం ప్రజాసేవలో ఉంటానని తాను కనీసం ఊహించలేదని మోదీ(Narendra Modi) గుర్తుచేసుకున్నారు. తనను నిరంతరం ఆదరిస్తున్న దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసేవలో విమర్శలు సహజమని, వాటిని పట్టించుకుంటే ముందుకు సాగలేమని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా బలోపేతం చేసేది ప్రత్యర్థుల విమర్శలేనని తెలిపారు.
2047 లక్ష్యంగా వికసిత్ భారత్.. గ్లోబల్ మేన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్:
2047 నాటికి ‘వికసిత్ భారత్’ ఆశయాన్ని సాధించి తీరుతామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ సాధన, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా దేశం ఎదుగుతున్న తీరును వివరించారు. అంతరిక్ష రంగంలో సరికొత్త విజయాలు, ఒలింపిక్స్ నిర్వహణ వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలు భారత దేశానికి సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదని హెచ్చరిక:
గత ప్రభుత్వాలు ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలపై మెతక వైఖరి ప్రదర్శించాయని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. అయితే తమ హయాంలో దేశ భద్రతకు ఏమాత్రం ముప్పు వచ్చినా గట్టి ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చేసి చూపించామని గర్వంగా వెల్లడించారు.
